
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: స్థానిక శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయం మరియు పాటి మీద శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో మంగళవారం సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతాలు అత్యంత భక్తిశ్రద్ధలతో, అంగరంగ వైభవంగా జరిగాయి.



శ్రీ అయ్యప్ప దేవాలయంలో:
శ్రీ అయ్యప్ప దేవాలయంలో 101 జంటలతో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాన్ని వేద పండితులు శ్రీ గూడ జగదీశ్వర శర్మ శాస్త్రోక్తంగా నిర్వహించారు. వేదమంత్రోచ్ఛారణల మధ్య జంటలు భక్తిపారవశ్యంతో స్వామివారి వ్రతంలో పాల్గొన్నారు. పూజా కార్యక్రమాల అనంతరం ఆలయానికి విచ్చేసిన సుమారు 1,000 మందికి పైగా భక్తులకు భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఆలయ కమిటీ అధ్యక్షులు కొత్తా అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలో కమిటీ నాయకులు ఈదులకంటి రవీందర్ రెడ్డి, పానుగంటి సత్యనారాయణ, శివనాధుని వేణు, బీడీ కుమార్, సీఎం రమేష్, గుంటి శ్రీనివాస్, పిల్లి సమ్మయ్య, నందు, రమేష్, మల్లేష్, సతీష్ మరియు గురుస్వాములు పాల్గొని ఏర్పాట్లను పర్యవేక్షించారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి తీర్థప్రసాదాలు స్వీకరించారు.


పాటి మీద ఆంజనేయస్వామి ఆలయంలో:
అదేవిధంగా, పాటి మీద శ్రీ ఆంజనేయస్వామి దేవాలయంలోనూ సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతం ఘనంగా జరిగింది. ఆలయ ప్రధాన అర్చకులు తిరుమలయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సుమారు 30 జంటలు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ వేడుకలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ కమిటీ చైర్మన్ గందె శ్రీనివాస్ అన్ని ఏర్పాట్లు చేశారు. పూజా వేడుకల్లో ప్రదీప్ అయ్యా గారు, లలిత్ అయ్యా గారు తదితరులు పాల్గొన్నారు. వ్రతం అనంతరం భక్తులందరికీ తీర్థప్రసాదాలు అందజేసి, అన్నప్రసాద వితరణ చేశారు.




