Oplus_16908288
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ : తెలంగాణ సంస్కృతీ సాంప్రదాయాలకు ప్రతీకలైన బతుకమ్మ, విజయదశమి పండుగల శుభసందర్భంగా 20వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ దామెర అనూష – అనురాగ్ దంపతులు తమ ఉదారతను చాటుకున్నారు. వార్డు పరిధిలోని మున్సిపల్ పారిశుధ్య కార్మికులకు, అంగన్వాడీ టీచర్లకు, ఆయాలకు మరియు ఆశా వర్కర్లకు పండుగ కానుకగా నూతన వస్త్రాలను (బట్టలను) ఘనంగా పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా కౌన్సిలర్ దామెర అనూష – అనురాగ్ మాట్లాడుతూ… సమాజానికి, వార్డు ప్రజలకు నిరంతరం అమూల్యమైన సేవలందిస్తున్న పారిశుధ్య కార్మికులు, ఆరోగ్య రక్షణలో కీలక పాత్ర పోషిస్తున్న ఆశా వర్కర్లు, పిల్లల భవిష్యత్తుకు పునాదులు వేస్తున్న అంగన్వాడీ సిబ్బంది సేవలు వెలకట్టలేనివని కొనియాడారు. వారి ముఖాల్లో సంతోషం చూడటమే తమకు నిజమైన పండుగ అని తెలిపారు. బతుకమ్మ, దసరా పండుగలను వార్డు ప్రజలందరూ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న కార్మికులు, సిబ్బంది మాట్లాడుతూ… ఏ అవసరం వచ్చినా తమకు అండదండగా నిలుస్తూ, నిరంతరం పేదవారి సంక్షేమం కోసం పరితపించే దామెర అనూష – అనురాగ్ దంపతులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పండుగ పూట తమను గుర్తుపెట్టుకుని వస్త్రాలు పంపిణీ చేయడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని హర్షం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో వార్డు ముఖ్య నాయకులు, మున్సిపల్ సిబ్బంది, అంగన్వాడీ, ఆశా వర్కర్లు మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
&&లోకల్ యాడ్స్&&
స్వర్ణోదయం డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ కు ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు.

శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు: శ్రీ బోరగాల మొగిలి గారు, 29వ వార్డు కౌన్సిలర్, హుజురాబాద్ పురపాలక సంఘం.





