Oplus_16908288
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ పట్టణంలో మరోసారి వన్యప్రాణుల సంచారం కలకలం రేపింది. స్థానిక శ్రీరామానుజయ కాలనీ (రెడ్డి కాలనీ)లో భారీ కొండచిలువ ప్రత్యక్షం కావడంతో కాలనీవాసులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
రాత్రి సమయంలో శ్రీరామానుజయ కాలనీ (రెడ్డి కాలనీ), రహదారి సమీపం జనావాసాల మధ్య రోడ్డుపై కొండచిలువ సంచరించడంతో స్థానికులు ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు.
అధికారులకు స్థానికుల విజ్ఞప్తి:
కాలనీలో కొండచిలువ సంచరిస్తున్న సమాచారం తెలుసుకున్నా ప్రజలు భయంతో వణికిపోతున్నారు. అటవీశాఖ అధికారులు తక్షణమే స్పందించి, ఆ కొండచిలువను సురక్షితంగా బంధించి అటవీ ప్రాంతానికి లేదా జనావాసాలకు దూరంగా తరలించాలని కాలనీ వాసులు కోరుతున్నారు.

⚠️ ప్రజలకు హెచ్చరిక / సూచనలు:
కాలనీ ప్రజలు ఎవరూ రాత్రి సమయాల్లో ఒంటరిగా బయటకు రావద్దని, అత్యంత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.
ఎక్కడైనా కొండచిలువ లేదా ఇతర వన్యప్రాణులు కనిపిస్తే, ఎట్టి పరిస్థితుల్లోనూ వాటి దగ్గరకు వెళ్లకుండా వెంటనే అటవీశాఖ అధికారులకు లేదా స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని సూచిస్తున్నారు.




