
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి
హుజురాబాద్ : స్థానిక జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో గత సంవత్సరం పదవ తరగతి (SSC) ఫలితాలలో హుజురాబాద్ మండల ప్రథమ స్థానంలో నిలిచిన ప్రతిభావంతురాలైన విద్యార్థిని కుమారి కళ్లెపు అభినవ శ్రీకి శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ ఆధ్వర్యంలో రూ. 10,000/- ల నగదు చెక్కును ప్రోత్సాహక బహుమతిగా అందజేశారు.
ఈ బహుమతి చెక్కును విద్యార్థిని తల్లిదండ్రులు క్రాంతి కుమార్, రజిని దంపతులకు మండల విద్యాధికారి (MEO) విడపు శ్రీనివాస్ ఆధ్వర్యంలో… శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ డివిజనల్ మేనేజర్ సతీష్ కుమార్, హుజురాబాద్ బ్రాంచ్ మేనేజర్ రాజేష్ ఖన్నా అందజేశారు.
విద్యార్థులకు ఉన్నత లక్ష్యాలే శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ ధ్యేయం: MEO శ్రీనివాస్
ఈ సందర్భంగా మండల విద్యాధికారి విడపు శ్రీనివాస్ మాట్లాడుతూ, అభినవ శ్రీని అభినందిస్తూ భవిష్యత్తులో ఆమె మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహిస్తున్న శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ యాజమాన్యాన్ని ప్రత్యేకంగా అభినందించారు. ఇలాంటి కార్యక్రమాలు మరికొందరికి స్ఫూర్తినిస్తాయని తెలిపారు.
డివిజనల్ మేనేజర్ సతీష్ కుమార్ మాట్లాడుతూ… 2025-26 విద్యా సంవత్సరంలో రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ మరియు మండల స్థాయిలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు క్యాష్ అవార్డులు అందజేసినట్లు తెలిపారు.
బ్రాంచ్ మేనేజర్ రాజేష్ ఖన్నా మాట్లాడుతూ… 2026-27 విద్యా సంవత్సరంలోనూ ఈ ప్రోత్సాహకాలు కొనసాగుతాయని, హుజురాబాద్ విద్యార్థులు ఈసారి జిల్లా స్థాయిలో అవార్డు గెలుచుకోవాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు గంకిడి సమ్మిరెడ్డి, బాలుర ఉన్నత పాఠశాల ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి భవాని, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థినీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ప్రధానోపాధ్యాయులు మరియు విద్యార్థి తల్లిదండ్రులు నిర్వాహకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
@లోకల్ యాడ్స్@
స్వర్ణోదయం డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ కు ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు.. మీ డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ మరింత అభివృద్ధి చెందాలని కోరుకుంటూ…

శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు: శ్రీ నాంపల్లి శ్రీనివాస్ గారు 24 వ వార్డు కౌన్సిలర్ (బోర్నపల్లి), పురపాలక సంఘం హుజూరాబాద్.





