
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
శ్రీరామ హుజురాబాద్ నాయి బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు బండారి శ్రీనివాస్ పుట్టినరోజు వేడుకలు సోమవారం పట్టణంలోని నాయి బ్రాహ్మణ సంఘ భవనంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆయనతో కేక్ కట్ చేయించి పలువురు కేకులు, స్వీట్లు తినిపించి, శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలని సంఘం సభ్యులు ఆకాంక్షించారు. ఇటువంటి వేడుకలు నాయి బ్రాహ్మణ సంఘంలో ఎల్లప్పుడూ జరగాలని సంఘం సభ్యులు కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో హుజురాబాద్ నాయి బ్రాహ్మణ సంఘం సభ్యులు అందరూ పాల్గొన్నారు.






