మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్:
హుజురాబాద్ మున్సిపల్ పరిధిలోని బోర్నపల్లిలో గల 14 వ,24వ వార్డ్ ల లో సన వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో పర్యావరణం పై అవగాహన సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ర్యాలీ నిర్వహించి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో సనా వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షురాలు మహమ్మద్ అస్మభాను, మహమ్మద్ సలాముద్దీన్ రిసోర్స్ పర్సన్ ఆలేటి సుధాకర్, గ్రామస్తులు రవీందర్రావు, అనిల్ తదితరులు పాల్గొన్నారు.
-సబ్ జైల్లో మొక్కలు నాటిన జైలర్
పర్యావరణ దినోత్సవము సందర్భంగా సబ్ జైలు ఆవరణలో బుధవారం సబ్ జైల్ జైలర్ గణేష్, అంగన్వాడి టీచర్ జ్యోతిరాణి , ప్రకృతి వైద్యులు బోళ్ల సుధాకర్ లు మొక్కలు నాటారు.
పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరిది
ప్రపంచాన్ని కాలుష్యం నుండి కాపాడాలంటే పర్యావరణ పరిరక్షణ అవసరమని అది ప్రతి ఒక్కరి బాధ్యత అని సామాజిక కార్యకర్త నలబాల వేణుగోపాల్ అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం హుజూరాబాద్ పట్టణంలో ఆయన సైకిల్ పై ప్రచార నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… మానవుని తప్పిదాల వల్ల అనేక సమస్యలు ఏర్పడుతున్నాయని కాలుష్యం పెరిగిపోయిందని దానికి విరుగుడుగా ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని అన్నారు.

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: