మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్:
హుజురాబాద్ నుండి జమ్మికుంట రోడ్ డివైడర్ మధ్యలో గత కొన్ని ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన క్రోనో కార్పస్ విషపూరితమైన చెట్లను ప్రభుత్వ అధికారులు వెంటనే తొలగించాలని హుజురాబాద్ ప్రజాసంఘాల నాయకులు బుధవారం చెట్ల వద్ద నిరసన వ్యక్తం చేసి డిమాండ్ చేశారు. క్రోనో కార్పస్ చెట్లు మానవులకు హాని కలిగించే ఉన్నాయని ఈ చెట్ల గాలిని పేల్చడం వల్ల ప్రజలకు శ్వాసకోశ సంబంధ సమస్యలు వస్తున్నాయని, అదేవిధంగా కాలుష్యం పెరుగుతుందని తెలిపారు. దీనివల్ల ఆక్సిజన్ కు బదులుగా కార్బన్డయాక్సైడ్ విడుదలవుతుందని, కావున ప్రజల ఆరోగ్యం దృష్ట్యా, పర్యావరణ పరిరక్షణను పెంపొందించడం కోసం ఈ చెట్లను వెంటనే తొలగించాలని హుజురాబాద్ ప్రజాసంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జ్యోతిరావు పూలే జయంతి కమిటీ మాజీ చైర్మన్ సందెల వెంకన్న, హుజురాబాద్ జిల్లా సాధన జేఏసీ కన్వీనర్ భీమోజు సదానందం, సైదాపూర్ మాజీ ఎంపీపీ పొడిశెట్టి వెంకట రాజం , వేల్పుల రత్నం, డాక్టర్ తడికమళ్ళ శేఖర్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు సొల్లు బాబు, కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర కన్వీనర్ ఇమ్మడి దయాకర్, బత్తుల రాజలింగం, ఇల్లందుల సమ్మయ్య, తాళ్ళపల్లి అమరేందర్ గౌడ్, దాట్ల ప్రభాకర్, కలకోటి శ్రీనివాస్, ఏనూరి అశోక్, కుక్కముడి రాజేష్, బొడ్డు అయిలయ్య తదితరులు పాల్గొన్నారు.