మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
జమ్మికుంట పట్టణంలోని మమత హాస్పిటల్ లో ఇటీవల రక్త నమూనాల విషయంలో జరిగిన పొరపాటు పై పలువురు చేసిన ఫిర్యాదు మేరకు హుజురాబాద్ డిప్యూటీ డిఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ చందునాయక్ విచారణ జరిపారు. ఆస్పత్రిలోని రికార్డులను పరిశీలించి రక్తనామోనాల టెస్టర్ కు సంబంధించిన వివరాలను పరిశీలించి, స్థానిక సిబ్బందిని, ఆసుపత్రి నిర్వహకులను పలు అంశాలపై అడిగి తెలుసుకున్నారు. దవఖానకి వచ్చే రోగుల పట్ల మర్యాదగా నడుచుకోవాలని, మెరుగైన వైద్య సేవలు అందించాలని కోరారు. విచారణ నివేదికను జిల్లా వైద్య అధికారికి పంపించినట్లు డిప్యూటీ డిఎంహెచ్వో చందు నాయక్ తెలిపారు. ఆయన వెంట కమ్యూనిటీ హేల్త్ ఆఫీసర్ సాజిద్ హుస్సేన్ తదితరులు ఉన్నారు.