
డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ బాధ్యతల స్వీకరణ
స్వర్ణోదయం ప్రతినిధి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా జనసేన అధినేత కె పవన్ కళ్యాణ్ బుధవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ముందుగా తన ఛాంబర్ లో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం పేద పండితుల ఆశీర్వాదం తీసుకొని కుటుంబ సభ్యుల ఆశీర్వచనాలు తీసుకున్నానంతరం పదవి బాధ్యతలు స్వీకరించి తన శాఖకు సంబంధించి మొదటి సంతకం చేశారు. పలువురు మంత్రులు, ఐఏఎస్, ఐపీఎస్ లు ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.






