
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కందుగుల గ్రామశాఖ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ఘనంగా వేడుకలు నిర్వహించారు. రాహుల్ గాంధీ నేతృత్వంలో భారతదేశం భవిష్యత్తులో మరింత అభివృద్ధి చెందుతుందన్న ఆశాభావాన్ని నాయకులు వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పానుగంటి కిరణ్ రెడ్డి, సమ్మిరెడ్డీ, రత్నాకర్ రెడ్డి, కంకణాల జనార్దన్ రెడ్డి, ఏండి నూరుళ్ళ, కోమల్ రెడ్డి, భరత్ రెడ్డి, రవి, బలరాం, మాదం సమ్మయ్య, కుమార్, రాజయ్య, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.






