స్వర్ణోదయం ప్రతినిధి, హైదరాబాద్: అమావాస్య అని అర్థరాత్రి 1.00 గంట తర్వాత బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఆరుగురు బిఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిలో దండి విఠల్, భానుప్రసాద్ రావు, బుగ్గారపు దయానంద్, ప్రభాకర్‌రావు, ఎగ్గే మల్లేశం, బస్వరాజు సారయ్యలు ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. వీరికి రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ దీపాదాస్ మున్షి పార్టీ కండువా కప్పి కాంగ్రెస్ లోకి ఆహ్వానించగా వీరి చేరికతో శాసన మండలిలో కాంగ్రెస్ బలం 12కి చేరింది. ఇంకో నలుగురైదుగురు చేరితే మండలిలో కాంగ్రెస్‌కు మెజార్టీ దక్కుతుంది. ఇప్పటికే ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులతో సతమతమవుతున్న బిఆర్ఎస్ పార్టీ ఒక్కసారిగా ఆరుగురు ఎమ్మెల్సీలు పార్టీ మారడంతో గట్టి షాక్ తగిలినట్లు అయింది.
✍️మీ గోపాలా అంజి🔥
👉కొల్లాపూర్ నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా..