మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: నూతన పిఆర్ సి ని వెంటనే ప్రకటించాలని తాప్ర కరీంనగర్ జిల్లా శాఖ అధ్యక్షులు చందుపట్ల జనార్ధన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక సైదాపూర్ రోడ్డులోని శ్రీ వెంకటేశ్వర మ్యారేజ్ బ్యూరో కార్యాలయంలో తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ (TAPRPA) హుజురాబాద్ శాఖ ఆధ్వర్యంలో చొల్లేటి మల్లారెడ్డి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తాప్ర కరీంనగర్ జిల్లా శాఖ అధ్యక్షులు చందుపట్ల జనార్ధన్ మరియు గౌరవ అధ్యక్షులు కట్ట నాగభూషణచారి హాజరై వారు మాట్లాడుతూ జూలై 2022 నుండి జనవరి 2024 వరకు పెండింగ్ లో ఉన్న 4 DAలను మరియు నూతన PRC ని వెంటనే ప్రకటించి, జూలై 2023 నుండి పెన్షనర్లకు మరియు ఉద్యోగులకు అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. అదే విధంగా ప్రతి జిల్లాలో రెండు wellness center లను ఏర్పాటు చేస్తూ…EHS స్కీం ను అమలు పరుస్తూ పెన్షనర్ల కొరకు ప్రత్యేక డైరెక్టరేట్ ను వెంటనే ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు బొంగోని వెంకటయ్య, సయ్యద్ మునీరుద్దీన్, హుజురాబాద్ శాఖ ప్రధాన కార్యదర్శి చీకట్ల సమ్మయ్య, కోశాధికారి మండల వీరస్వామి, జమ్మికుంట శాఖ అధ్యక్షులు గరిగె చంద్రయ్య, కార్యవర్గ సభ్యులు రామ కిష్టయ్య, పరాంకుశం సనత్ కుమార్, గాజె గంగయ్య, దొంత హరికిషన్, N రాజిరెడ్డి, T రామకిష్టం తదితరులు పాల్గొన్నారు.
- Home
- నూతన పిఆర్ సి ని వెంటనే ప్రకటించాలి..తాప్ర కరీంనగర్ జిల్లా శాఖ అధ్యక్షులు చందుపట్ల జనార్ధన్