Oplus_16908288
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజూరాబాద్ : అప్పుల బాధ తాళలేక ఓ గృహిణి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన హుజూరాబాద్ పట్టణంలో చోటుచేసుకుంది. సీఐ కరుణాకర్ తెలిపిన వివరాల ప్రకారం.. హుజురాబాద్‌లోని విద్యానగర్‌కు చెందిన వేముల కరుణాకర్ (57) జే10 ఏజెన్సీలో పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు.
ఆయన భార్య భాగ్యలక్ష్మి (56) గృహిణి. వీరికి సొంత ఇల్లు కానీ, భూమి కానీ లేదు. ఈ క్రమంలో కుటుంబ అవసరాల నిమిత్తం పిరమల్ ఫైనాన్స్ సంస్థ నుంచి సుమారు రూ.10 లక్షల వరకు అప్పు తీసుకున్నారు. గత కొంతకాలంగా ప్రతి నెలా ఈఎంఐలు చెల్లిస్తూ వస్తున్నారు. ఇటీవల కరుణాకర్‌కు పని సరిగ్గా దొరకకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు మొదలయ్యాయి.
అప్పులు ఎలా తీర్చాలో తెలియక ఆర్థిక భారం పెరిగిపోవడంతో భాగ్యలక్ష్మి తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఈ క్రమంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో సీలింగ్ ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకుని ప్రాణాలు విడిచారు. మృతురాలి భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు టౌన్ సిఐ కరుణాకర్ తెలిపారు.

ఆత్మహత్యకు పాల్పడిన వేముల భాగ్యలక్ష్మి(56) అనే గృహిణి





