
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజూరాబాద్: హుజురాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ రోంటాల సుహాసినికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, 2వ వార్డు కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ అబ్దుల్ అలీంతో కలిసి గణేష్ నగర్ ప్రజల వినతి పత్రం అందజేశారు.
హుజురాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ గా ఎన్నికైన రోంటాల సుహాసినికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, 2వ వార్డు కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ అబ్దుల్ అలీం ఆధ్వర్యంలో 2వ వార్డులోని గణేష్ నగర్ ప్రజలు పుష్పగుచ్చం ఇచ్చి శాలువాతో సత్కరించి ఘన సన్మానం చేశారు.
ఈ సందర్భంగా గణేష్ నగర్ నుంచి వచ్చిన ప్రజలందరూ మాట్లాడుతూ.. గణేష్ నగర్ లోని డ్రైనేజీ మరియు రోడ్డు, ప్రధానమైన మురికి కాల్వల సమస్యలు పరిష్కరించాలని, ఇప్పటివరకు ఎవరు కూడా మా వార్డును పట్టించుకోలేదని, కావున మీరు ఒక్కసారి మా గణేష్ నగర్ ఏరియాలో పర్యటించాలని ఈ సందర్భంగా చైర్ పర్సన్ రోంటాల సువాసిని ని కోరారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ రోంటాల సుహాసిని మాట్లాడుతూ తప్పకుండా మీ వార్డులో పర్యటిస్తానని మీరు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి ముందుంటానని, మీ సమస్యలను నా దృష్టికి తీసుకురావాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో 2వ వార్డు అధ్యక్షుడు ముఖిద్ అహ్మద్ ఖాన్, షడమకి వీరయ్య, ఆబిద్, జుబేర్, రాఖిబ్ తదితరులు పాల్గొన్నారు.

మున్సిపల్ చైర్పర్సన్ సుహాసిని కి శాలువా కప్పి, పుష్పగుచ్చలు ఇచ్చి సత్కరిస్తున్న రెండవ వార్డు గణేష్ నగర్ కు చెందిన ప్రజలు..





