
–ఓసి సామాజిక సంక్షేమ సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, జాతీయ చైర్మన్ నల్లా సంజీవ్ రెడ్డి. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గోపు జైపాల్ రెడ్డి. గౌరవ అధ్యక్షులు అమరవాది లక్ష్మీనారాయణ, గంగు ఉపేంద్ర శర్మలు..
స్వర్ణోదయం ప్రతినిధి, న్యూఢిల్లీ:
ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను సంపూర్ణంగా పటిష్ట అమలుకు జాతీయ స్థాయి ఓసి కమిషన్ ఏర్పాటు చేయాలని ఓసి జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, జాతీయ చైర్మన్ నల్లా సంజీవరెడ్డి, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గోపు జైపాల్ రెడ్డి, గౌరవ అధ్యక్షులు అమరవాది లక్ష్మీనారాయణ,గంగు ఉపేంద్ర శర్మ, వర్కింగ్ ప్రెసిడెంట్ తాడి శెట్టి పశుపతి లు డిమాండ్ చేశారు. రాజ్యాంగ బద్దంగా ఏర్పడ్డ 10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై అసత్య ప్రచారాలు చేస్తున్న కుట్రలను సాగానివ్వబోమని , దీనిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఓసి సామాజిక సంక్షేమ సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావుతో పాటు పలువురు ఓసి ఐకాస జాతీయ రాష్ట్ర నాయకులు పిలుపు నిచ్చారు. ఓసి పేదల న్యాయమైన డిమాండ్ల సాధనకు సోమవారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఓసి జేఏసీ ఆధ్వర్యంలో జాతీయ స్థాయి ఓసిల మహాధర్నా నిర్వహించారు.

వివిధ రాష్ట్రాల నుంచి పలువురు ఓసి ఐకాస రాష్ట్ర నాయకులు మహా ధర్నాకు పెద్ద ఎత్తున తరలి వచ్చారు ఓసి ఐకాస జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, జాతీయ చైర్మన్ నల్లా సంజీవ్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గోపు జైపాల్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ తాడి శెట్టి పశుపతి, జేఏసీ గౌరవ అధ్యక్షులు అమరవాది లక్ష్మీనారాయణ గంగు ఉపేంద్రశర్మ, బుస్సా శ్రీనివాస్ లు మాట్లాడుతూ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల పటిష్ట అమలుకు ప్రత్యేక జాతీయ ఓసి కమిషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
రాజ్యాంగ బద్దంగా ఏర్పడ్డ 10శాతం ఈడబ్లూఎస్ రిజర్వేషన్ల పై రాజకీయ పబ్బం కోసం కొన్ని దుష్ట శక్తులు ఆయా కులాల్లోని ప్రజలను మభ్య పెడుతూ చేస్తున్న అసత్య ప్రచారాలు, పన్నుతున్న కుట్రలను సాగనివ్వ బోమని స్పష్టం చేశారు. దీనిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపు నిచ్చారు. ఓసిల జనాభా 22శాతం ఉంటుందని ఇందులొ సయ్యద్, పఠాన్ లు ఉన్నారని స్వార్థ రాజకీయ ప్రయోజనాల ఓటు బ్యాంక్ రాజకీయాలతో ఓసిలను పలుచన చేయాలనే కుయుక్తులను సాగనివ్వబోమని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఓసిలకు నేటికీ రాజకీయ రిజర్వేషన్లు లేక తీవ్ర అన్యాయానికి గురవుతున్నారని వివిధ రాష్ట్రాల స్ధానిక సంస్థల ఎన్నికల్లో జనరల్ స్థానాల్లో సైతం ఎదుటివారి ఆర్థిక అంగ బలం ముందు ఓసి అభ్యర్ధులు సరితూగ లేక జనరల్ స్థానాల్లో కనీసం 20 శాతం సీట్లు కూడా గెలుచుకోలేక పోతున్నారని పోలాడి రామారావుతోపాటు ఐకాస నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఓటుబ్యాంకు రాజకీయాలతో ఓసిలకు నేటికీ తీవ్ర నష్టం జరుగుతుందని అన్నారు. తాము ఎవరికీ వ్యతిరేకం కాదని అన్ని వర్గాల ప్రజలకు అన్ని రంగాల్లో సమన్యాయం జరగాలన్నదే తమ ఓసి జేఏసీ ధ్యేయమని పేర్కొన్నారు. స్ధానిక ఎన్నికల్లో రాజకీయ రిజర్వేషన్లు ఓసిలకు కూడా కల్పించాలని నాయకులు డిమాండ్ చేశారు.
ఓసి ఈడబ్ల్యూఎస్ విద్యార్థులకు విద్యా ఉద్యోగ పోటీ పరీక్షలలో వయోపరిమితిని పెంచాలని, ఈడబ్ల్యూఎస్ వారికి కేటాయించిన మిగిలిపోయిన బ్యాక్ లాగ్ పోస్టులను ఆ వర్గాల వారితోనే వెంటనే భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ జారీకి 10లక్షల ఆదాయ పరిమితి పెంచాలని ,డిమాండ్ చేశారు.
ప్రస్తుతం అమలవుతున్న రిజర్వేషన్ల లో పేదలకు సంపూర్ణ న్యాయం జరగడం లేదని అందువల్ల అన్ని వర్గాల పేద విద్యార్థులకు విద్యా ఉద్యోగ పోటీ పరీక్షలలో న్యాయం కోసం అమలవుతున్న రిజర్వేషన్లలో క్రిమిలేయర్ పద్దతి అమలు చేయాలని ఇందుకు రాజ్యాంగ సవరణ చేయాలని డిమాండ్ చేశారు,
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలను వర్తింప చేయాలని కోరారు. రైతుల భీమావయోపరిమితిని 70 ఏళ్లకు పెంచాలని, రైతు పండించే ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించటానికి రైతు భాగస్వామ్యంతో ప్రత్యేక చట్టం తేవాలని సూచించారు, జాతీయ ఉపాధి హామీ పథకం ను వ్యవసాయ రంగంతో అనుసందానించాలని డిమాండ్ చేశారు,తమ డిమాండ్లను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్లేందు కోసమే దేశ రాజధాని ఢిల్లీ వేదికగా ఈనాటి ధర్నా నిర్వహించామని వెల్లడించారు. తాము వ్యక్తిగతంగా కలిసి ఆహ్వానించినా ఏ ఒక్క రాజకీయ పార్టీల ఓసి ప్రజాప్రతినిధులు హాజరకాకకపోవడాన్ని తీవ్రంగా పరిగణించి రాబోయే ఎన్నికల్లో మా దెబ్బకు అబ్బో అనే విధంగా దీటుగా గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. ఈ ధర్నా కార్యక్రమానికి వివిధ రాష్ట్రాల ఓసి ఐకాస జాతీయ, రాష్ట్ర నాయకులు
పలువురు తాజా మాజీ ప్రజా ప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులతో పాటు 500 మంది పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఓసి జేఏసీ జాతీయ, రాష్ట్ర నాయకులు దుబ్బ శ్రీనివాస్, చందుపట్ల నరసింహారెడ్డి, బుస్సా శ్రీనివాస్, జనగామ కరుణాకర్ రావు, బద్దూరు వెంకటేశ్వర్ రెడ్డి, నడిపెళ్లి వెంకటేశ్వర్ రావు, మహంకాళి రాజన్న, రాయపాటి శ్రీనివాస్ రావు, ఎడవెల్లి కొండాల్ రెడ్డి, ఇరుకుళ్ళ రామకృష్ణ, రావుల నరసింహారెడ్డి, ప్రతాప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

న్యూఢిల్లీ మహాధర్నాలో మాట్లాడుతున్న ఓసి జెఎసి జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..



ఓసి జెఏసి నాయకులతో కలిసి అభివాదం చేస్తున్న పోలాడి రామారావు..





