
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ నియోజకవర్గంలోని కరీంనగర్ రోడ్డులో మొదటిసారిగా ఎంఎం హుస్సేన్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన STUMPS బాక్స్ క్రికెట్ ను హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ వొడితల ప్రణవ్ బాబు గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వోడితల ప్రణవ్ మాట్లాడుతూ హైదరాబాద్ సిటీలోని మాదిరిగా హుజురాబాద్ లో బాక్స్ క్రికెట్ నెలకొల్పడం శుభ పరిణామం అని అన్నారు. యువత సెలవులలో సమయాన్ని వృధా చేయకుండా ఆటలవైపు దృష్టి మళ్లించాలని తెలిపారు. ఈ సందర్భంగా బాక్స్ క్రికెట్ ను ఏర్పాటు చేసిన నిర్వాహకులు మహమ్మద్ మక్బూల్ హుస్సేన్ మరియు మహమ్మద్ ముషుని అభినందించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో హుజురాబాద్ ఏసిపి శ్రీనివాస్ జీ, హుజురాబాద్ టౌన్ సిఐ తిరుమల్, జామే మస్జిద్ ఈద్గా & ఖబరస్తాన్ మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షుడు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్, ముస్లిం మత గురువులు ముఫ్తీ షాకిర్, నయీం, మీర్జా ఇమ్రాన్ బేగ్, కాంగ్రెస్ నాయకులు, యువకులు పాల్గొన్నారు.







