
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: పరిసరాల పరిశుభ్రతతోనే వ్యాధులు రాకుండా ఉంటాయని శానిటేషన్ ఇన్స్ పేక్టర్ కిషన్ రావు అన్నారు. మున్సిపల్ పరిధిలోని 19వ వార్డులో శుక్రవారం డ్రై డే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పాడైన కుళాయిలలో నిలువైన నీటిని ఇంటింటికి తిరిగి పారబోశారు. మురికి నీటి నిల్వలలో బ్లీచింగ్ లేదా పాడైన ఇంజన్ ఆయిల్ పోసి దోమల లార్వాలను ఎదగకుండా చూడాలని వార్డు ప్రజలకు సూచించారు. దోమలు కుట్టకుండా దోమతెరలు వాడాలని, కాచి చల్లార్చిన మంచినీటిని త్రాగాలని సూచించారు. పరిసరాల పరిశుభ్రత తోనే ఎలాంటి వ్యాధులు ధరి చేరవని వివరించారు. ఈ కార్యక్రమంలో 19వ వార్డ్ యూత్ కాంగ్రెస్ నాయకులు గోస్కుల రాజ్ కుమార్, ఎండీ యాకూబ్ పాషా, ఎండి సాజిత్, జవాన్ అనిల్ కుమార్, వార్డు ఆఫీసర్ వెంకటరమణ, ఆర్ పి తిరుమల, ఆశ వర్కర్ శారద, వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.







