Oplus_0
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజా పంథా జిల్లా నాయకులు జిందం ప్రసాద్ డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక హుజురాబాద్, జమ్మికుంట ఏరియా పార్టీ ముఖ్య సమావేశం పిడిఎస్యు ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు అంగిడి కుమార్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి పార్టీ జిల్లా నాయకులు జిందం ప్రసాద్ హాజరై మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను కాలయాపన లేకుండా వెంటనే అమలు చేయాలని కోరారు. రేషన్ కార్డులు కొత్త ఇండ్లు పెంచిన పింఛన్లు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు, భవన నిర్మాణ కార్మికుల సమస్యలు బీడీ వర్కర్స్, కార్మికుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని అన్నారు. విద్యార్థులకు రావాల్సిన ఫీజు రియాల్మెంట్స్ వెంటనే ఇవ్వాలన్నారు. గ్రామాలకు నిధులు కేటాయించి గ్రామాలను అభివృద్ధి చేయాలని, అదేవిధంగా నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నారు. కార్పొరేట్ విద్యాసంస్థలైన శ్రీ చైతన్య, నారాయణ విద్యాసంస్థల ఫీజులను నియంత్రించాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు సునీల్, రాజయ్య, రాజమ్మ తదితరులు పాల్గొన్నారు.






