భారీ వర్షాల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..లోయర్ మానేర్ డ్యాంను పరిశీలించిన మంత్రి పొన్నం ప్రభాకర్.

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:భారీ వర్షాల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బిసి సంక్షేమ, రవాణా శాఖ మాత్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ సూచించారు. ఆదివారం ఎమ్మేల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి,ఇతర అధికారులతో కలిసి లోయర్ మానేర్ డ్యాంను మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ రాష్ట్రంలో భారీ వర్షాలు కూరుస్తున్నాయి కనుక ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, అధికారులు ఎక్కడ నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దు అని అన్నారు. గత కొంత కాలంగా చెరువులు, కుంటలు నిండలేదని ఆందోళన పడుతున్న నేపథ్యంలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు నిండుతున్నాయన్నారు. మరో రెండు రోజులు పాటు వర్షాలు ఉన్నాయన్నారు. జిల్లాలో పునరావాస కేంద్రాలకు తరలించెంత ఇళ్లలో నుండి ప్రజలను ఖాళీ చేసే పరిస్థితి ఎక్కడ లేదన్నారు. అలాగే ప్రాణ నష్టం ఎక్కడ లేదు అన్నారు. కోహడ్ – ముల్కనూరు ఇళ్ళంతకుంట మండలంలో తదితర ప్రాంతాల్లో రోడ్ల మీద నుండి వరద పోవడం వల్ల రవాణా అగిపోయిందన్నారు.

ప్రాజెక్టులోకి ఇన్ ఫ్లో మొదలైంది. ఎల్ఎండిలో 24 టీఎంసీ లకు ప్రస్తుతం 14 టిఎంసి ల ఉన్నాయి. మిడ్ మానేరుకు మోయ తుమ్మెద వాగు, మూల వాగు నుండి వరద వస్తుందన్నారు. ఎల్లంపల్లి నుండి రోజువారీగా ఇప్పటికే నీటి విడుదల జరుగుతుందని తెలిపారు. మిడ్ మానేరు ,లోయర్ మానేరు, రంగ నాయక సాగర్, మల్లన్న సాగర్, కొండ పోచమ్మ సాగర్ వరకు ప్రాజెక్ట్ లో నింపుకునే విధంగా వర్షాలు పడ్డాయని, అటు కిందికి కోదాడ వరకు నీళ్ళు అందించవచ్చు అని తెలిపారు. కరీంనగర్ తో పాటు ఇతర మున్సిపాలిటీలలో ఎక్కడ లోతట్టు ప్రాంతాల్లో నీళ్ళు ఇళ్లల్లోకి వచ్చిన పరిస్థితి ఎక్కడ లేదనీ, అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నాం అని తెలిపారు. అక్కడక్కడ వాటర్ లాగింగ్ పాయింట్స్ దగ్గర క్లియర్ చేస్తున్నారన్నారు. అందరూ అధికారులు క్షేత్ర స్థాయిలో వారు కేంద్రాల్లో నిరంతరం పని చేస్తున్నారని చెప్పారు.

హైదరాబాద్ ఇంచార్జి మంత్రిగా అక్కడ అధికారులతో మాట్లాడను ఎక్కడ ఇబ్బంధి లేదు అని అన్నారు. హిమాయత్ సాగర్,ఉస్మాన్ సాగర్ ప్రాజెక్టు లలో లెవెల్స్ నిండే పరిస్థితి ఉందన్నారు. కాళేశ్వరంలో టెక్నికల్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారమే నీటి నిల్వ కొనసాగుతుందన్నారు. ఎల్లంపల్లి నుండి ప్రతి చుక్క ఉపయోగించుకునే విధంగా ప్రాజెక్ట్ లలో పంపిస్తాం అని తెలిపారు. శ్రీరామ్ సాగర్ లో ప్రస్తుతం 64 టిఎంసి ల ఉన్నాయి..పూర్తి స్థాయి నిండగానే వరద కాలువ ద్వారా నీళ్ళు విడుదల జరుగుతుందని, ఎప్పటికప్పుడు ఇరిగేషన్ అధికారులు చర్యలు తీసుకుంటున్నారన్నారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులో తమ్మడి హట్టి నుండి గుండెకాయ లాంటి ఎల్లంపల్లి ప్రాజెక్ట్ కు నీళ్లు తీసుకొచ్చేది ఆ నీరు మిడ్ మానేరు, రంగనాయక సాగర్, మల్లన్నసాగర్, కొండ పోచమ్మ సాగర్ లకు తీసుకుపోయేదన్నారు. ఇప్పుడు నీరు కిందికి వృథాగా పోతున్నాయని రాబోయే కాలంలో వ్యవసాయం ఇబ్బందులు ఉండవు అన్నారు. ప్రతిపక్షాలు వ్యవసాయానికి ఇబ్బందులు ఉండడద్దని కోరుకోవాలన్నారు. వర్షాలు, ప్రాజెక్టులు, వ్యవసాయం పేరు మీద రాజకీయాలు చేయద్దు అని అన్నారు.. ముఖ్యమంత్రి సీఎస్ కి ఆదేశించారని, సిఎస్ కలెక్టర్లతో ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారన్నారు. హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో వర్షాలు ఎక్కువగా ప్రాంతాల్లో స్కూల్ లకు సెలవులు ఇచ్చారని చెప్పారు.. హైదరాబాద్ లో 141 వాటర్ లాగింగ్ పాయింట్స్ వద్ద సిబ్బంది అప్రమత్తంగా ఉన్నారన్నారు. లోతట్టు ప్రాంతాల్లో ఎక్కడికక్కడ మా ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు పాల్గొనాలని, రోడ్ల పై వరద వెళ్తుంటే ద్విచక్ర వాహనాలకు కూడా అనుమతి ఇవ్వకూడదన్నారు. సిద్దిపేట – హనుమకొండ దారిలో కూడా వరద పోతుందని, ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టిన ప్రజలు సహకరించాలన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!