Oplus_0
–హుజురాబాద్ రజక సంఘం నాయకులు హర్షం.
–కోటి ఉమెన్స్ కాలేజీకి చాకలి ఐలమ్మ పేరు చరిత్రత్మకం
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: చాకలి ఐలమ్మ 39వ వర్ధంతినీ పురస్కరించుకొని సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ కోటిలోని మహిళా యూనివర్సిటీ కి వీరనారి చాకలి ఐలమ్మ పేరు పెట్టాలని, చాకలి ఐలమ్మ మనవరాలు శ్వేతను మహిళా కమిషన్ సభ్యురాలిగా నియమించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి హర్షం వ్యక్తం చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి కరీంనగర్ జిల్లా హుజురాబాద్ రజకులు, స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో పాలాభిషేకం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి కొన్ని చరిత్ర ఆత్మకు నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రజక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొండపాక శ్రీనివాస్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు కొలిపాక శంకర్, నల్ల బాలరాజు, గోపు వెంకటేశ్వర్లు, నాగవెల్లి రాజు, సుంకరి రాజేందర్, సుంకరి రాజమౌళి, కొలిపాక రవి, కొలిపాక శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.






