మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: హుజురాబాద్ పట్టణ సమాఖ్య సర్వ సభ్య సమావేశంలో భాగంగా పోషణ సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. స్థానిక మునిసిపల్ కార్యలయములో బుధవారము హుజురాబాద్ పట్టణ సమాఖ్య ఆధ్వర్యములో సర్వ సభ్య సమావేశము, గర్భవతులకు సిమంతము నిర్వహించడం మరియు పోషణ సంభరాలు నిర్వహించడము జరిగినది. ఈ సందర్భంగా పట్టణ సమాఖ్య ఆదాయ, వ్యయాలు ఆడిట్ రిపోర్ట్ గురించి అందరికి తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హుజురాబాద్ బల్దియా చైర్ పర్సన్ గందే రాధిక, మెప్మా కరీంనగర్ ప్రాజెక్ట్ డైరెక్టర్ స్వరూపరాణి హాజరై మాట్లాడారు. ఈ సమావేశములో సంఘాల పనితీరు మరియు పుస్తక నిర్వహణ, ఆదాయ వ్యయ నిర్వహణ, పేమెంట్ రిపేమెంట్. స్వయము ఉపాధి పధకాల గురించి పిడి మెప్మా స్వరూపరాణి తెలియజేసారు. కమీషనర్ సల్వాది సమ్మయ్య, చైర్ పర్సన్ గందె రాధిక పోషకాహార ప్రాధాన్యత, మహిళల ఆరోగ్యం గురించి తెలియజేసారు. పోషణ సంబరాలలో భాగంగా పలు రకాల పౌష్టికాహారం గల పిండి వంటలను ప్రదర్శించారు. CDPO వాటిని గురించి చర్చించారు. మరియు హుజురాబాద్ పట్టణ సమాఖ్య ఆధ్వర్యములో గర్భవతులకు సిమంతము నిర్వహించడం జరిగినది. మునిసిపల్ కమీషనర్ ఎస్. సమ్మయ్య, DMC శ్రీవాణి, ADMC మల్లీశ్వరి, CLRP రమాదేవి, స్వరూప, PWD వాలంటీర్ అనూష మరియు RP లు OB లు హాజరయ్యారు.