
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ ప్రాంతీయ ఆసుపత్రిని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా ప్రాంతీయ ఆస్పత్రిలోని చిన్నపిల్లల పరిరక్షణ కేంద్రమును, లేబర్ రూమ్ ను, గర్భిణీ స్త్రీలకు అందించే సేవల గురించి ఆరా తీశారు. హుజురాబాద్ డివిజన్ పరిధిలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు సంబంధించిన గర్భిణీ స్త్రీలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని ప్రాంతీయ ఆస్పత్రి సిబ్బందికి సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వారము మితిమీరిన యాంటీబయాటిక్స్ వాడడం వల్ల కలిగే అనర్థాలను వైద్య సిబ్బంది ప్రజలకు వివరిస్తారని తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో సాధారణ ప్రసవాలు జరిగేటట్లు చూడాలని వైద్యాధికారులకు చెప్పారు. డాక్టర్ వెంకటరమణ వెంట ప్రాంతీయ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజేందర్రెడ్డి డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ చందు ఆర్ఎంవో డాక్టర్ సుధాకర్ రావు, జిల్లా హెల్త్ ఎడ్యుకేటర్ పంజాల ప్రతాపులు, వైద్యులు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.






ఈ సందర్భంగా మొట్టమొదటిసారి డిఎంహెచ్ఓ హోదాలో వచ్చిన డాక్టర్ వెంకటరమణను ఆసుపత్రి సూపర్డెంటెంట్ రాజేందర్ రెడ్డి, ఆర్ఎంవో సుధాకర్ రావు, వైద్య అధికారులు ఘనంగా సన్మానించారు. అలాగే డిప్యూటీ డిఎంహెచ్వో మరియు ఆఫీస్ సిబ్బంది కూడా సన్మానించారు.





