కమ్యూనికేషన్ స్కిల్స్ తో భవిష్యత్తుకు బాట..కిట్స్ డైరెక్టర్ డాక్టర్ కే శంకర్

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:


కమ్యూనికేషన్స్ స్కిల్స్ పెంపొందించుకొనడం వలన ఉద్యోగం పొందే అవకాశం ఎక్కువగా ఉంటుందని, కేవలం సాంకేతిక పరిజ్ఞానం మాత్రమే ఉద్యోగము పొందేందుకు కొలమానం కాదని కమల ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ సింగాపురం డైరెక్టర్ డాక్టర్ కే శంకర్ అన్నారు. డాక్టర్ శంకర్ గురువారం కళాశాల సమావేశ మందిరంలో జరిగిన కమ్యూనికేషన్ స్కిల్స్ తో భవిష్యత్తుకు బాట ఒకరోజు కార్యాశాల ప్రారంభ సమావేశంలో అధ్యక్షా ఉపన్యాసం చేశారు. డాక్టర్ శంకర్ మాట్లాడుతూ ఇంజనీరింగ్ విద్యార్థి సాంకేతిక పరిజ్ఞానంతో పాటు కమ్యూనికేషన్స్ స్కిల్స్ అనగా తనకు తెలిసిన విషయాన్ని ఇతరులకు సులభముగా వివరించే నైపుణ్యాన్ని పెంచుకోవాలని ఇంజనీరింగ్ విద్యార్థి తాను పనిచేసే సంస్థలో వివిధ స్థాయిలలో ఉన్న అధికారులతో కమ్యూనికేషన్ చేయవలసి వస్తుంది, విద్యార్థికి మాట్లాడే నైపుణ్యము, డాక్యుమెంట్ రాసే నైపుణ్యము, ఆంగ్ల భాషపై పట్టు, ఇంజనీరింగ్ డ్రాయింగ్ మొదలగు వాటిని పెంపొందించుకోవాలని అన్నారు. ఈ ఆధునిక కాలంలో ఇంజనీరింగ్ విద్యార్థికి కంప్యూటర్ సైన్స్ నైపుణ్యములు ఇంటర్నెట్ ను ఉపయోగించి శాస్త్రీయ సాంకేతిక వివరాలను పొందే నైపుణ్యము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీని ఉపయోగించి చేయవలసిన పనిని మరింత సులభముగా చేసే అవకాశాలను కనుగొనటం చాలా ముఖ్యమైన నైపుణ్యమని అన్నారు. ఈ నైపుణ్యాన్ని ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ నైపుణ్యం అని అంటారన్నారు. ఆధునిక కాలంలో అభ్యర్థులు పంపించే ఉద్యోగ రెస్యూమ్ లను అధికారులు కాకుండా కంప్యూటర్ సాఫ్ట్వేర్లు ఆటోమేటిక్ గా పరిశీలించి తమకు అవసరమైన అభ్యర్థులను ఎన్నుకుంటున్నదని అన్నారు. అందువలన అభ్యర్థి రెస్యూమ్ తయారు చేసుకునేటప్పుడు పలు జాగ్రత్తలు వహించి ఒక ఉద్యోగానికి ఎటువంటి నైపుణ్యములు అవసరము, ఆ నైపుణ్యములను తన అభ్యర్థన పత్రములో ఉంచాలని అన్నారు. కమ్యూనికేషన్స్ కేవలం ఉద్యోగం కోసం మాత్రమే కాకుండా ఒక సొంతగా సంస్థ స్థాపించి తమ ఉద్యోగులతో మరియు తమ కస్టమర్లతో సంబంధాలను పెంచుకునేందుకు ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. ఒక వ్యక్తి ఉన్నతమైన నైపుణ్యములు కలిగి ఉంటే అతనికి ఎటువంటి ఫెయిల్యూ ఫెయిల్యూర్స్ ఎదురుకాని అన్నారు. కళాశాల రిజిస్ట్రార్ హ్యుమానిటీస్ అండ్ సైన్స్ విభాగాధిపతి డాక్టర్ వి రాజేశ్వరరావు మాట్లాడుతూ విద్యార్థులకు కమ్యూనికేషన్ నైపుణ్యములను పెంపొందించేందుకు పలు కార్యక్రమాలను చేపడుతున్నామని, యూనివర్సిటీ సిలబస్ ప్రకారము కమ్యూనికేషన్ ల్యాబ్ ను ఆధునీకీకరించామని అన్నారు. ఈ కార్యక్రమంలో శిక్షకులుగా ఎస్సార్ యూనివర్సిటీ ఆంగ్ల విభాగాధిపతి డాక్టర్ రూపేష్ మరియు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎన్ఐటి వరంగల్ ఆంగ్ల విభాగ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కన్నెప్ నాథ్ మల్హరి శిక్షణ ఇచ్చారు. కన్నెపు నాథ్ మల్హరి మాట్లాడుతూ సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులందరూ తమ సొంత కృషితోనే పైకి వచ్చిన వారే, ఆంగ్ల భాష నేర్చుకునేటప్పుడు స్వతంత్రముగా వ్యవహరించి నేర్చుకోవాలని ఏదైనా ఇబ్బంది ఉంటే సంశయము లేకుండా అధ్యాపకులను అడిగి నేర్చుకోవాలని, ఆంగ్ల భాషను ఎంత ఎక్కువగా మాట్లాడితే అంత ఎక్కువ నైపుణ్యం వస్తుందని, రైటింగ్ స్కిల్స్ కూడా పెంచుకోవాలని, జీవితంలో ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని దానికి అనుగుణంగా సిద్ధం కావాలని అన్నారు. డాక్టర్ రూపేష్ మాట్లాడుతూ ఒక మనిషి యొక్క ఉన్నతికి భావవ్యక్తీకరణ చాలా ముఖ్యమని, తాను ఎదుర్కొన్న సమస్యల గురించి సమర్థవంతంగా వివరించాలని ఏదైనా పరిస్థితి ఎదురైనప్పుడు అవును అని కానీ కాదు అని కానీ మొహమాటం లేకుండా ఎటువంటి సంశయం లేకుండా చెప్పిన వారు మాత్రమే జీవితంలో ముందుకు వెళ్తారని అన్నారు. ఈ కార్యక్రమ సమన్వయకర్తలుగా కమలా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ సింగాపురం ఆంగ్ల భాష అధ్యాపకులు సమన్వయకర్త డాక్టర్ జి వీర్య నాయక్, సహా సమన్వయకర్తలు ఏం తిరుపతి, ఓ శ్రీనివాస్, ఎన్ స్టాలిన్ లు వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!