
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: తెలంగాణ టీచర్స్ యూనియన్ హుజురాబాద్ మండల కార్య నిర్వాహక సమావేశము మండల శాఖ అధ్యక్షులు పొద్దుటూరు కిషన్ రెడ్డి అధ్యక్షతన గురువారం సాయంత్రం హుజూరాబాదులో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆ సంఘం జిల్లా శాఖ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పోలంపెల్లి ఆదర్శన్ రెడ్డి మరియు గంప చంద్రశేఖర్ లు హాజరైనారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ టీచర్స్ యూనియన్ ఉపాధ్యాయుల సమస్యల సాధన కోసం అంకితభావంతో పనిచేస్తుందని అన్నారు. గత కొన్నేళ్లుగా పెండింగ్లో ఉన్న పదోన్నతుల ప్రక్రియను పూర్తి చేసి అర్హులైన ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించినందుకు ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా గత దశాబ్ద కాలంగా ఇంకా అనేక సమస్యలు పెండింగ్లో ఉన్నాయని వాటన్నింటినీ ప్రభుత్వం పరిష్కరించాలన్నారు. 317 జీవోద్వారా స్థానికత కోల్పోయి నష్టపోయిన ఉపాధ్యాయులందరికీ తగిన న్యాయం చేయాలని కోరారు. పెండింగ్ లో ఉన్న డీఎలను ప్రకటించడంతో పాటు పెరిగిన నిత్యవసర వస్తువుల ధరలకు అనుగుణంగా 40 శాతం ఫిట్మెంట్తో పీఆర్సీ ప్రకటించి వెంటనే అమలుపరచాలని కోరారు. యూనిఫైడ్ సర్వీస్ రూల్స్ కల్పించి అర్హులైన ఉపాధ్యాయులందరికీ మండల విద్యాధికారులుగా, డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్లుగా, డైట్ లెక్చరర్ గా మరియు జూనియర్ లెక్చరర్ గా పదోన్నతులు కల్పించాలని కోరారు. ఈ సమావేశంలో మండల శాఖ ప్రధాన కార్యదర్శి దానంపల్లి శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షులు తాళ్ల తిరుపతి, జిల్లా కార్యదర్శి ఓరుగంటి తిరుపతి, మండల అసోసియేట్ అధ్యక్షులు పత్తెం శ్రీనివాస్ మరియు మండల కార్యవర్గ సభ్యులు ప్రాథమిక సభ్యులు పాల్గొన్నారు. సమావేశానంతరం 2024-25 మరియు 2025-26 సంవత్సరాలకు గాను నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల సింగపూర్ లో స్కూల్ అసిస్టెంట్ గా విధులు నిర్వహించుచున్న పొద్దుటూరు కిషన్ రెడ్డి మండల శాఖ అధ్యక్షులుగా, ప్రాథమిక పాఠశాల రాజాపూర్ లో సెకండరీగ్రేడ్ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న దానంపల్లి శ్రీనివాస్ మండల శాఖ ప్రధానకార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డారు. అదేవిధంగా జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల చెల్పూరులో స్కూల్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న ఎం.సుధాకర్ అసోసియేట్ అధ్యక్షులుగా, మహిళ అసోసియేట్ అధ్యక్షురాలిగా ప్రాథమిక పాఠశాల చెల్పూరు లో పనిచేస్తున్న కె.రమాదేవి, ప్రాథమిక ఉన్నత పాఠశాల హుజరాబాద్ లో ఎస్డిటిగా పనిచేస్తున్న ఎస్ విజయలత, మహిళ ఉపాధ్యక్షులుగా జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల చెల్పూర్ లో స్కూల్ అసిస్టెంట్ పనిచేస్తున్న వి.స్వర్ణలతాదేవి, ప్రాథమిక పాఠశాల సిర్సపల్లి లో ఎస్జిటిగా పనిచేస్తున్న కె.రజనీ, ఉపాధ్యక్షులుగా ప్రాథమికోన్నత పాఠశాల ఇందిరానగర్ లో ఎస్జిటిగా పనిచేస్తున్న టి రాజేందర్, జెడ్పీ హెచ్ యస్ బోర్నపల్లిలో స్కూల్ అసిస్టెంట్ (మ్యాథ్స్) గా పని చేస్తున్న బి.రాజయ్య, జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల చెల్ఫూర్ లో స్కూల్ అసిస్టెంట్ (మ్యాథ్స్)గా పని చేస్తున్న కె.రాజేందర్, ప్రాథమిక పాఠశాల చెల్పూర్ లో యస్జీటిగా పని చేస్తున్న కె.రాజయ్య, అలాగే మహిళా కార్యదర్శిగా యుపిఎస్ హుజురాబాద్ లో స్కూల్ అసిస్టెంట్ గా పని చేస్తున్న జి.రాధిక, జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో పని చేస్తున్న గోదాదేవి, జెడ్పీ హెచ్ యస్ సింగపూర్ లో పనిచేస్తున్న బి.ఉమాదేవి, కార్యదర్షులుగా యుపిఎస్ ఇంద్దిరానగర్ లో స్కూల్ అసిస్టెంట్ సోషల్ గా పనిచేస్తున్న జి.ప్రదీప్ రెడ్డి మరియు యుపిఎస్ హుజూరాబాదులో స్కూల్ అసిస్టెంట్ సోషల్ గా పని చేస్తున్న టి.సంపత్ యుపిఎస్ పోతిరెడ్డిపేటలో పనిచేస్తున్న కే.సంపత్ కుమార్ లు మండల ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు జిల్లా శాఖ అధ్యక్ష,ప్రధాన పోలంపెల్లి ఆదర్శన్ రెడ్డి, గంప చంద్రశేఖర్లు తెలిపారు.








