మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్ (ఆర్మూర్): రానున్న పట్టబద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనను భారీ మెజారిటీతో గెలిపిస్తే నిరుద్యోగ నిర్మూలనకు మొదటి ప్రధాన్యతను ఇస్తానని పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి స్పష్టం చేసారు.. గురువారం ఆర్ముర్ పట్టణంలో పలువురు పట్టభద్రులను, న్యాయవాదులను కలసి రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో మద్దతు పలుకలాని కోరారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా చాలాచోట్ల కోర్టులకు పక్క భవనాలు లేక, అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయని. తాను ఎమ్మెల్సీగా గెలిచిన తరువాత అన్ని కోర్టులకు పక్క భవనాలను నియమిస్తామని అన్నారు. న్యాయవాద వృత్తిలోకి కొత్తగా వస్తున్న యువ న్యాయవాదులకు 5వేల గౌరవ వేతనంతో పాటు న్యాయవాదుల ప్రధాన డిమాండ్ అయిన అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అమలుతో పాటు అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల పట్టాలు ఇప్పించెందుకు కృషి చేస్తానని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 317 జీవో ద్వారా ఎంతోమంది ఉద్యోగ, ఉపాధ్యాయులు ఇతర ప్రాంతాల్లో ఉద్యోగం చేస్తూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారి స్థానికతను దృష్టిలో ఉంచుకొని సొంత జిల్లాలకు బదిలీ అయ్యేవిధంగా కృషిచేసి వారికి బాసటగా నిలుస్తానని వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కళాశాలల్లో పని చేస్తున్న కాంట్రాక్ట్ బేసిక్, అవుట్ సోర్సింగ్, గెస్ట్ లెక్షరర్లకు ఇతర ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా 010 పద్దు ధ్వారా వేతనాలు ఇప్పించేందుకు కృషి చేస్తానని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టో పెట్టిన జాబు క్యాలెండర్ అమలు అయ్యేవిధంగా కృషి చేస్తానని, ప్రభుత్వంలోని వివిధ రంగాలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి కృషి చేస్తానని అన్నారు. ప్రైవేటు పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు హెల్త్ కార్డులతో పాటు, మినిమమ్ బేసిక్ శాలరీ అందించేందుకు కృషిచేస్తానని తెలిపారు. ప్రైవేటు డిగ్రీ పీజీ కళాశాల యాజమాన్యానికి గత కొన్ని నెలలుగా పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల విడుదలకు సహకరిస్తానని అన్నారు. ఓటు నమోదు చేసుకొని పట్టభద్రులకు కోసం నవంబర్ 23 నుండి డిసెంబర్ 09 వరకు ఎన్నికల కమిషన్ మరో అవకాశం కల్పించిందని, ప్రతి పట్టభద్రుడు దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. తనను భారీ మెజారిటీతో గెలిపిస్తే పట్టభద్రుల ప్రతినిధిగా వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని వీఎన్అర్ అన్నారు.
- Home
- నిరుద్యోగ నిర్మూలనకు మొదటి ప్రాధాన్యత…పట్టభద్రుల ప్రతినిధిగా మండలిలో సమస్యలు పరిష్కరిస్తా… – ఆర్మూరు పట్టణంలో ఎమ్మెల్సీ అభ్యర్థి విస్తృత ప్రచారం