– నెలల కాలంగా ఉద్దేర ముచ్చట్లతో కాంగ్రెస్ సర్కార్ టైంపాస్ పాలన చేస్తుంది.
–ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ కు గుణపాఠం చెప్తాం..
–కాంగ్రెస్ సర్కార్ మెడలు వంచి ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు పోరాడుతాం.
–బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజయోత్సవ సభల పేరిట నిర్వహిస్తున్న సభలు పూర్తిగా తిట్ల పురాణాలకు, రాజకీయాలకు వేదికలుగా మారాయని బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి అన్నారు. గురువారం రోజున కరీంనగర్, మానకొండూర్, చొప్పదండి, హుజురాబాద్ నియోజకవర్గాలలో ఆయా నియోజకవర్గాల బిజెపి ముఖ్య నేతల సమావేశాలు జరిగాయి. ఈ సమావేశాలకు ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి అడ్డగోలు హామీలు ఇచ్చిందని, ఆరుగ్యారెంటీలు, 420 హామీలు, డిక్లరేషన్ ల గురించి నోరెత్తకుండా 11 నెలలకాలంగా కాంగ్రెస్ సర్కార్ టైం పాస్ వలన చేస్తుందని విమర్శించారు. మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీ బస్సు ప్రయాణం తప్పితే మహిళలకు ఇస్తామన్న రూ. 2500, వివాహాలు చేసుకున్న మహిళలకు కల్యాణలక్ష్మితో పాటు తులం బంగారం ఏమైందని ఆయన ప్రశ్నించారు. యువతులకు స్కూటీలు, గ్యాస్ సిలెండర్ రూ. 500, రైతు రుణమాఫీ, రైతు భరోస, 500 బోనస్, నిరుద్యోగ భృతి ఇలా చెప్పుకుంటూ పోతే అనేక హామీలు ఉన్నాయన్నారు. అన్ని వర్గాల ప్రజలను కాంగ్రెస్ మాయమాటలతో మోసపూరిత హామీలతో మోసం చేసిందన్నారు. అందుకే ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ మోసాన్ని బట్టబయలు చేయడానికి ప్రజానీకానికి అండగా నిలవడానికి బిజెపి పోరాట బాట పడుతుందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు బిజెపి పోరాటం ఆపదని హెచ్చరించారు. నియోజకవర్గంలోని బీజేపీ శ్రేణులు అందరూ పార్టీ క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమాలను పూర్తి చేయాలన్నారు. పార్టీ సంస్థ గత ఎన్నికల పర్వం ప్రారంభమవుతున్న దృశ్య బూత్ స్థాయి ఎన్నికల కోసం సిద్ధంగా ఉండాలన్నారు. ఈ సమావేశాల్లో ఆయా నియోజకవర్గాల అసెంబ్లీ కన్వీనర్లు, జిల్లా, రాష్ట్ర నాయకులు, మండల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.