
–కేసును ఛేదించిన పోలిసులను నగదు రివార్డు అందించిన ఏసీపీ
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ఇటీవల హుజురాబాద్ మండలంలోని సింగపూర్ గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆటోను గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టి వెళ్లడంతో ఒక వ్యక్తి మృతి చెందిన విషయం విధితమే. ప్రమాదానికి సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు తమ చాకచక్యంతో కేసును చేదించారు. హుజురాబాద్ ఏసిపి శ్రీనివాస్ జి ఆదేశాల మేరకు టౌన్ సిఐ తిరుమల్ గౌడ్ ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఎస్సై యూనస్ అహ్మద్ అలీ తన బృందంతో విచారణ ప్రారంభించారు. సాంకేతిక టెక్నాలజీ ఉపయోగించి యాక్సిడెంట్ చేసిన లారీ కోసం పలు ప్రాంతాలు గాలించిన పోలీసులకు చివరకు నిర్మల్ సమీపంలో లారీ ఉన్నట్టు గుర్తించి లారీని ట్రేస్ చేసి పట్టుకున్నారు. కేసును సవాల్ గా తీసుకున్న పోలీసులు
ప్రమదం జరిగిన కొన్ని రోజులకే చేదించారు. దీనిపై హుజురాబాద్ ఏసిపి శ్రీనివాస్ జి ఎస్సై యూనస్ అహ్మద్ అలీతో పాటు హెడ్ కానిస్టేబుల్ సంపత్, హోంగార్డ్ రవిని అభినందించారు. వీరికి తన చేతుల మీదుగా నగదు రివార్డును కూడా అందజేసి అభినందించారు.








