
మండల యాదగిరి, స్వర్ణోదయ ప్రతినిధి కరీంనగర్: సనాతన హిందూ ధర్మ గొప్పతనాన్ని ఆవశ్యకతను తెలిపే విధంగా రూపొందించిన యాప్ బాగుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. సమస్త సనాతన ధర్మ సమాచారం అందించే యజ్ఞేనా కల్పత యాప్ ను శనివారం విజయదశమి సందర్భంగా స్థానిక మహాశక్తి ఆలయంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హిందీ శక్తులు ఏకం కావలసిన అవసరం ఉందన్నారు. సనాతన ధర్మ గొప్పతనం తెలిపే ఇలాంటి ఆవిష్కరణలు మరిన్ని రావాల్సిన అవసరం ఎంతో ఉందని తెలిపారు. సనాతన ధర్మంపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడే వారికి సమాధానం ఇచ్చే విధంగా కరీంనగర్ యువకులు గొప్ప ప్రయత్నాన్ని చేశారని తెలిపారు. భారతీయ సనాతన ధర్మ గొప్పతనాన్ని, ఆనాటి బుషులు, యోగులు సృష్టించిన అద్భుత ఆవిష్కరణలు వాటి వివరాలతో పూర్తి సమాచారం అందుబాటులోకి తీసుకువచ్చే విధంగా యజ్ఞేన కల్పత యాప్ రూపొందించారని పేర్కొన్నారు. దీనిలో సనాతన భారతీయ గొప్పతనం, ఆవిష్కరణలు, నాటి ఇంజనీరింగ్, శాస్త్ర సాంకేతిక అద్భుత ఆవిష్కరణల పూర్తి వివరాలను అందించే వివరాలు అందుబాటులో తీసుకువచ్చారని తెలిపారు. అలాగే భారతీయ సనాతన విద్య విధానం వాటిల్లోని గొప్పతనం, నేటి పశ్చిమ దేశాల కంటే ఎంతో ముందుగానే భారతీయ రుషులు అందించిన వైజ్ఞానం గొప్పతనం వివరించే విధంగా ఉందని తెలిపారు. ప్రస్తుత కాలంలో సనాతన ధర్మ సమస్త సమాచారం ఇచ్చే ఏకైక వేదిక యజ్ఞేన కల్పత అన్నారు. వార్తలు, నోటిఫికేషన్లు, సంస్కృతి సమాచారం ఇలా ఒక్కటేమిటి అన్నింటినీ అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమన్నారు. ఈ యాప్ ని డౌన్లోడ్ చేసుకోవడానికి కింది లింక్ ని క్లిక్ చేయండి.
https://play.google.com/store/apps/details?id=com.yagnenakalpatha

——-+——–+——-+———–
*పత్రికా ప్రకటనలు*






