పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు! -నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన గురుకుల పూర్వ విద్యార్థి. వినయ్ ని అభినందించిన సిఐ రవి

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని 29వ వార్డుకు చెందిన ఆకునూరు స్వరూప -రాజుల మొదటి కుమారుడు ఆకునూరు వినయ్ ఒకటి కాదు రెండు కాదు, ఒక సంవత్సర కాలంలోనే నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన సందర్భంగా జమ్మికుంట పోలీస్ స్టేషన్లో మర్యాద పూర్వంగా పిలిచి శాలువతో సత్కరించి పూల బొకేతో జమ్మికుంట (సిఐ) ఇన్స్పెక్టర్ వి రవి ఘనంగా అభినందించారు. 2023 సం.లో కేంద్రీయ విద్యాలయంలో టి జి టి (పి & హెచ్. ఈ) 2024 ఫిబ్రవరి లో గురుకులం స్కూల్ ఫిజికల్ డైరెక్టర్ ( పి. డి) ఇటీవల వెలువడిన డి ఎస్సి ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ (పి ఈ టి ) కరీంనగర్ జిల్లా మొదటి విజేత, డి ఎస్సీ స్కూల్ అసిస్టెంట్ (ఫిజికల్ ఎడ్యుకేషన్) సాధించడం గర్వ కారణమని తెలిపారు.
సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టుదల ఉంటే దేన్నైనా సాధించవచ్చు అని నిరూపించిన వినయ్ యువతకు ఆదర్శమని అన్నారు. వినయ్ ని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్క విద్యార్థినీ విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నతంగా కావాలని కోరారు.

యువత దేశానికి వెన్నుముక లాంటిదని యువతీ యువకులందరూ ఎలాంటి చెడు వ్యసనాలకు లోను కాకుండా తమ తల్లిదండ్రులు కన్న కలలను సాకారం చేసే విధంగా సన్మార్గంలో నడవాలని కోరారు. కొందరు యువతీ యువకులు వ్యసనాలకు, కోరికలకు ఆకర్షితులై తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని అన్నారు. ఇంటర్మీడియట్ మరియు డిగ్రీ విద్యార్థిని విద్యార్థులు తమ ఎమోషన్స్ ను కంట్రోల్ చేసుకొని అనుకున్న లక్ష్యాన్ని సాధించాలని కోరారు. వినయ్ చిన్నతనం నుండి ప్రభుత్వ పాఠశాలల్లో యూనివర్సిటీలలో విద్యాభ్యాసాన్ని పూర్తి చేసుకుని అనుకున్న లక్ష్యాన్ని సాధించుకోవడం గర్వకారణమని అన్నారు. ఈ సన్మాన కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల పూర్వ విద్యార్థులు అంబాల ప్రభాకర్ ప్రభు దొడ్డ కుమారస్వామి శనిగరపు కుమార్ తదితరులు పాల్గొన్నారు.


*పత్రికా ప్రకటనలు*

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!