మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి యాదాద్రి భువనగిరి: ముప్పై ఏండ్లుగా అలుపెరుగని పోరాటం సాగించి న్యాయం కోసం కొట్లాడి సుప్రీం కోర్టు నుండి వర్గీకరణ పట్ల అనుకూల తీర్పు సాధించామని, యస్సీ వర్గీకరణ అమలు సంవత్సరంగా ఉద్యమం సాగిస్తామని, కమిటీలు, కమిషన్ల పేరుతొ కాలయాపన చేయకుండా తక్షణమే యస్సీ వర్గీకరణ అమలు చేయాలని యంయస్పీ జిల్లా అధ్యక్షులు నల్ల చంద్రస్వామి మాదిగ డిమాండ్ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గం ఆత్మకూర్ (యం) మండలం పల్లెపహాడ్ గ్రామంలో
విజయ దశమి సందర్భంగా వివిధ సామాజిక, విప్లవ, రాజకీయ ఉద్యమాలలో అశువులు బాసిన అమరవీరుల స్మారకార్థం ప్రతి సంవత్సరం సామాజిక, ఉద్యమ, రాజకీయ జెండాలు గ్రామంలో ఎగుర వేయడం జరుగుతుందన్నారు.
అందులో భాగంగా ఎమ్మార్పియాస్ వ్యవస్థపాక అధ్యక్షులు
మాన్యశ్రీ మంద కృష్ణ మాదిగ అడుగుజాడల్లో నడుస్తున్న
మాదిగ దండోరా (ఎమ్మార్పియాస్ ) పల్లే పహాడ్ గ్రామ శాఖ జెండాను ఆవిష్కరించడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా యంయస్ పీ జిల్లా అధ్యక్షులు నల్ల చంద్ర స్వామి మాదిగ మాట్లాడుతూ ముప్పై ఏండ్లుగా మంద కృష్ణ మాదిగ నేత్రుత్వంలో యస్సీ వర్గీకరణ కోసం అలుపెరుగని పోరాటం చేసి న్యాయం కోసం కొట్లాడి అత్యున్నత సుప్రీం కోర్టు నుండి వర్గీకరణ పట్ల అనుకూల తీర్పు సాధించాం అని తక్షణమే తెలంగాణ లో యస్సీ వర్గీకరణ అమలు చేయాలనీ కమిటీలు, కమిషన్లతో కాలాయాపన చేయొద్దని వర్గీకరణ అమలు అయ్యేదాకా ఎంపిక పరీక్షల,ఉద్యోగాల భర్తీ నిలుపుదల చేయాలనీ అన్నారు. ఈ కార్యక్రమంలో యంయస్ పీ జిల్లా అధ్యక్షులు నల్ల చంద్ర స్వామి మాదిగ, యంఆర్ పీయస్, యంయస్ పీ మండల, గ్రామ శాఖ నాయకులు పందుల భిక్షపతి మాదిగ, శ్రీరాములు మాదిగ, గజ్జెల్లి పవన్ మాదిగ, జీడీ ఎలందర్ మాదిగ, గజ్జెల్లి శంకర్ మాదిగ, యాదగిరి మాదిగ, పరుశరామ్ మాదిగ, చంద్రయ్యమాదిగ, మహేష్ మాదిగ, క్రాంతి మాదిగ తదితర నాయకులు పాల్గొన్నారు.
*పత్రికా ప్రకటనలు*