–వేములవాడలో హెలిప్యాడ్ వద్ద
స్వాగతం పలికిన వెలిచాల రాజేందర్ రావు తో ఆత్మీయంగా ముఖ్యమంత్రి సంభాషణ..
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్ (వేములవాడ) వెలిచాల రాజేందర్ అన్న ఎలా ఉన్నావు.. బాగున్నావా.. అన్న అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆత్మీయంగా పలకరించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటనకు విచ్చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వేములవాడలో హెలిప్యాడ్ వద్ద వెలిచాల రాజేందర్ రావు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజేందర్ అన్న. ఎలా ఉన్నావు.. బాగున్నావా.. అని ప్రత్యేకంగా పలకరించారు. రేవంతన్న బాగున్నా అని రాజేందర్ రావు సమాధానం ఇచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరకు తీసుకొని ఆత్మీయంగా పలకరించడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని రాజేందర్ రావు పేర్కొన్నారు. ఎంతో పోరాట పటిమ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచంలోని గొప్ప నగరంగా తీర్చిదిద్దేందుకు కంకణం కట్టుకున్న నేత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని వెలిచాల రాజేందర్ రావు పేర్కొన్నారు.
వేములవాడలో 1000 కోట్ల అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టడం చారిత్రాత్మకం..సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ రోజు ఈ రోజు..
–కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు
–ప్రజా పాలన విజయోత్సవ సభకు హాజరు
వేములవాడలో బుధవారం 1000 కోట్ల రూపాయలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టడం చారిత్రాత్మకమని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి పర్యటనతో వేములవాడ ప్రాంతం పులకరించిపోయిందని, ఈరోజు సువర్ణ అక్షరాలతో లెక్కించదగ్గ రోజు అని తెలిపారు. బుధవారం వేములవాడ పర్యటనకు విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ కు వెలిచాల రాజేందర్ రావు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం రాజన్న ఆలయంలో ముఖ్యమంత్రి నిర్వహించిన ప్రత్యేక పూజల్లోనూ రాజేందర్ రావ్ పాల్గొన్నారు. అనంతరం రాజన్న గుడి చెరువు వద్ద ఏర్పాటు చేసిన ప్రజా పాలన విజయోత్సవ సభకు హాజరయ్యారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో కలిసి ఈ సభలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వెలిచాల రాజేందర్ రావు మీడియాతో మాట్లాడుతూ
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 76 కోట్లతో రాజన్న ఆలయ అభివృద్ధి పనులతో పాటు రోడ్డు విస్తరణ పనులు చేపట్టడం హర్షణీయమని పేర్కొన్నారు. దశాబ్దాల కలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చిందని, ఎన్నో ఏళ్ల నుంచి ఎదురుచూస్తున్న యార్న్ డిపోను ముఖ్యమంత్రి ప్రారంభించి వారి చిరకాల వాంఛను నెరవేర్చారని తెలిపారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోని మిడ్ మానేరు నిర్వాసితుల సమస్యలను సైతం కాంగ్రెస్ ప్రభుత్వం పరిష్కరిస్తున్నదని చెప్పారు.
4696 ఇండ్లను నిర్వాసితులకు మంజూరు చేయడం, వేములవాడలో యార్న్ డిపో కోసం 50 కోట్లు కేటాయించిందన్నారు. సిరిసిల్లలో చేపట్టనున్న 166 కోట్లతో ప్రభుత్వ మెడికల్ కాలేజీ, హాస్టల్ భవనానికి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారని తెలిపారు. మంత్రి పొన్నం ప్రభాకర్ స్థానిక ఎమ్మెల్యే విప్ ఆది శ్రీనివాస్, కేకే మహేందర్ రెడ్డి, తన విజ్ఞప్తి మేరకు రాజన్న సిరిసిల్ల వేములవాడలో అనేక అభివృద్ధి పనులు చేపట్టేందుకు వేల కోట్ల రూపాయలను ప్రభుత్వం మంజూరు చేసిందని చెప్పారు. ఈ ప్రాంత అభివృద్ధి కోసం కృషి చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలకు రాజేందర్ రావు అభినందనలు తెలిపారు. వేములవాడ ముఖ్యమంత్రి పర్యటనకు పెద్ద సంఖ్యలో తరలివచ్చి బహిరంగ సభను విజయవంతం చేసిన కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పేరుపేరునా రాజేందర్ రావు ధన్యవాదాలు తెలిపారు.