మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
హుజురాబాద్ పట్టణం, పరిసర ప్రాంతాల్లోని ప్రభుత్వ ప్రైవేటు బ్యాంకులను హుజురాబాద్ ఏసిపి సిహెచ్ శ్రీనివాస్ జి సందర్శించి సెక్యూరిటీ, సీసీ కెమెరాలను ఇతర ఏర్పాట్లను బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన బ్యాంకు ఉన్నతాధికారులతో మాట్లాడారు. బ్యాంకు రక్షణ కోసం వారు తీసుకుంటున్న చర్యలు, సీసీ కెమెరాల వివరాలు వాటి పనితీరు ప్రత్యక్షంగా చూసి అడిగి తెలుసుకున్నారు. బ్యాంకు చుట్టుపక్కల ప్రాంతాలను సందర్శించి బ్యాంకు వారితో మాట్లాడి సెక్యూరిటీ సిస్టంలో, సీసీ కెమెరాలు విషయంలో ఎలాంటి లోపాలు లేకుండా నిరంతరం ఉండేటట్లు చూసుకోవాలని సూచించారు. ఏదైనా అనుమానాస్పదంగా గాని కొత్త వ్యక్తులు అనుమానస్పదంగా కనబడితే వెంటనే డయల్ 100 కు సమాచారం ఇవ్వాలని కోరారు. ఆయన వెంట హుజురాబాద్ టౌన్ సిఐ తిరుమల్ గౌడ్, పోలీసు సిబ్బంది, బ్యాంక్ ఉద్యోగులు ఉన్నారు.