
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి వరంగల్: వరంగల్ వాణిజ్య పన్నుల శాఖ జాయింట్ కమిషనర్ కార్యాలయంలో నూతనముగా బేగంపేట్ డివిజన్ నుండి వరంగల్ నోడల్ జాయింట్ కమిషనర్ గా బదిలీ అయి వచ్చిన రావుల శశిధర్ చారి పదవి బాధ్యతలు చేపట్టిన సందర్భంగా తెలంగాణ వాణిజ్య పనుల శాఖ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ ఆధ్వర్యంలో పలు జిల్లాల నాయకులు శుక్రవారం ఆయనను కలిసి ఘనంగా సత్కరించారు. ఆయనను సత్కరించిన వారిలో వరంగల్ డివిజన్ టిసిటి ఎన్జీవోస్ సంఘం అధ్యక్షులు గోపి కిషోర్, కరీంనగర్ డివిజన్ అధ్యక్షులు గుంటి బిక్షపతి, రాష్ట్ర ఉపాధ్యక్షులు జి ప్రభాకర్, టిసిటి ఎన్జీవోస్ సంఘ నాయకులు మహమ్మద్ సలావుద్దీన్, పోల్సాని శ్రీనివాసరావు, పి ప్రవీణ్, జి రమేష్, కృష్ణవేణి, సునీత, మమత ఉన్నారు. ఈ సందర్భంగా వరంగల్ నోడల్ జాయింట్ కమిషనర్ వాణిజ్య పన్నుల శాఖ అధికారి రావుల శశిధర్ చారి పదవి బాధ్యతలు చేపట్టిన సందర్భంగా శాలువాలు మరియు బొకేలు ఇచ్చి స్వీట్లు తినిపించి టిసిటిఎన్జీవోస్ సంఘం పక్షాన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మర్యాద పూర్వకంగా కలిసిన సందర్భంలో వరంగల్ నోడల్ జాయింట్ కమిషనర్ కార్యాలయం పరిధిలో వరంగల్, ఖమ్మం, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలలో పనిచేస్తున్న వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగుల ఏదైనా సమస్య ఉంటే తన దృష్టికి తీసుకొని వచ్చినచో ఆ సమస్యల పరిష్కారం కొరకు మీ వంతు కృషి చేయాలని వరంగల్ నోడల్ జాయింట్ కమిషనర్ వాణిజ్య పన్నుల శాఖ అధికారి రావుల శశిధర్ చారిని కోరారు. నా పరిధిలో ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే ఆ సమస్యల పరిష్కారం కొరకు నా వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ మాట్లాడుతూ గతంలో పనిచేసిన ప్రాంతాలలో కూడా చాలా మంచి పేరు గుర్తింపు ఉన్న అధికారి వరంగల్ నోడల్ జాయింట్ కమిషనర్ అని, వాణిజ్య పన్నుల శాఖ అధికారిగా రావుల శశిధర్ చారి పదవి బాధ్యతలు చేపట్టటం చాలా సంతోషమని ముజాహిద్ పేర్కొన్నారు. ఆయనతోపాటు సంఘ నాయకులు జి బిక్షపతి, పి శ్రీనివాసరావు, మహమ్మద్ సలావుద్దీన్, కృష్ణవేణి, సునీత, ప్రభాకర్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.









