
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్, డిసెంబర్ 6: డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకుని శుక్రవారం హుజురాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు గోస్కుల శ్రీనివాస్ అధ్యక్షతన బార్ అసోసియేషన్ హాల్ నందు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి న్యాయవాదులు పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా పలువురు న్యాయవాదులు అంబేద్కర్ సేవలను, ఆయన ఔన్నత్యాన్ని గుర్తుచేశారు. అంబేద్కర్ ఆలోచనా విధానాన్ని అందరూ ఆచరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ కార్యదర్శి మట్టెల తిరుపతి, ఏపీపీ రాం ఉపేందర్, ఏజీపీ గుర్రం శ్రీనివాస్, పలువురు సీనియర్ మరియు సీనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు.

విద్యుత్ శాఖ డిఈ కార్యాలయంలో బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి వేడుకలు
బాబాసాహెబ్ డా. బిఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్బంగా శుక్రవారం హుజురాబాద్ లోని విద్యుత్ డివిజనల్ ఇంజనీర్ లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అసమానతలు వున్న భారత సమాజంలో అందరికి సమాన అవకాశాలు కల్గించే విధంగా రాజ్యాంగంలో స్త్రీలకు, కులం వల్ల వివక్షత, అన్ని రంగాలలో వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి వీలు కల్పించే విధంగా ఎస్సి/ఎస్టి లకు బిసి లకు రాజ్యాంగం తగు రాజ్యాంగ రక్షణలు కల్పించారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మమత ఏఈ/టెక్, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్స్ గుంటి రవీందర్, తిరుపతయ్య, ఓదెలు, డివిజన్ ఆఫీస్ స్టాఫ్ సత్యనారాయణ, అసిస్టెంట్ లత, విజయ పాల్గొన్నారు.

హుజురాబాద్ హెడ్ పోస్ట్ ఆఫీస్ లో ఘనంగా మహాపరినిర్వాన్ దివాస్
-డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 68వ మహా పరినిర్వాణ దినోత్సవాన్ని పురస్కరించుకొని హుజురాబాద్ హెడ్ పోస్ట్ ఆఫీస్ లో ఘనంగా నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొనటువంటి అఖిల భారత తపాలా ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు
యు మహేందర్ మాట్లాడుతూ..
77సంవత్సరాల స్వాతంత్ర భారత దేశంలో ఇప్పటికి అసమానతలు, పేదరికం, నిరుద్యోగం, ఆకలికేకలు, కుల వివక్ష ఉన్నాయన్నారు. పాలకవర్గాలు వారి యొక్క కుల, మత ,ప్రాంత రాజకీయాలను అడ్డుపెట్టుకొని అభివృద్ధి చేయడం లేదని విమర్శించారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని ఖచ్చితంగా అమలు చేసినప్పుడు బడుగు, బలహీన , మైనారిటీ మరియు అగ్రవర్ణ పేదలకు న్యాయం జరుగుతుందని, పాలకులు తమ పార్టీల ఎజెండాలను పక్కకు పెట్టి దేశ మరియు పౌర అభివృద్ధికి తొడ్పాడే విదముగా పరిపాలన సాగించాలని, ప్రతి పౌరుడు తన కర్తవ్యాన్ని కచ్చితంగా నిర్వర్తించడమే నిజమైన దేశభక్తి అని తెలుపుతూ, డ్డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేయాలనీ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ పోస్ట్ మాస్టర్ సిహెచ్ ప్రవీణ్ కుమార్, ఎస్సీ ఎస్టీ డివిజన్ సెక్రెటరీ యం శ్రీనివాస్, ప్రెసిడెంట్ తిరుపతి నాయక్, పోస్టల్ స్టాఫ్ సందీప్, శివం సింగ్, హరీష్, స్వామి, సతీష్, శివాజీ, రాజేష్, రాము, సత్యం తదితరులు పాల్గొన్నారు.

ఇప్పల నర్సింగపూర్ లో…
భారత రాజ్యాంగ నిర్మాణము కీలక పాత్రధారి అంటరానితనంపై అలుపెరుగని పోరు చేసిన భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళి అర్పిస్తున్న ఇప్పల నర్సింగాపూర్ ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు బోరగాల రాజు కుమార్, ఉపాధ్యక్షులు మంద రాజు, కార్యదర్శి మాట్ల అఖిల్, కోశాధికారి బొరగల సాగర్,సభ్యులు వర్శిత్, బండ అజయ్ , దాట్ల దీలిప్, కట్కూరి రాకేష్, వెంకటేష్, మేకల సంజీవ్ తదితరులు ఉన్నారు






