Oplus_131072
స్వర్ణోదయం ప్రతినిధి, ములుగు: ములుగు వాజేడు ఎస్.ఐ రుద్రారపు హరీష్ ఆత్మహత్యకు కారణమైన మహిళను శనివారం అరెస్ట్ చేశారు. ఈనెల 2వ తేదీన వాజేడు లోని రిసార్ట్ లో సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డ వాజేడు ఎస్.ఐ రుద్రారపు హరీష్ ఆత్మహత్యకు కారణం అనసూర్య అని పోలీసులు నిర్ధారించారు. దీంతో సూర్యాపేట జిల్లా దూద్వాతండాకు చెందిన బానోత్ అనసూర్య (29) అనే మహిళను అన్ని సాక్షదారాలతో అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. అనసూర్య ప్రేమ పేరుతో హరీష్ ను వేధింపుల గురిచేసి ఆత్మహత్యకు ప్రేరేపించినట్టు పోలీసులు వెల్లడించారు. ఈ కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తించగా ఎట్టకేలకు మహిళా అరెస్టుతో సస్పెన్షన్ కు స్వస్తి పలికినట్లైంది.






