
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: పేద గిరిజన, దళిత రైతులకు బేడీలు వేసిన కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మంగళవారం వినూత్నంగా నిరసన తెలిపారు. అసెంబ్లీలో నల్ల చొక్కాలు ధరించి, చేతులకు బేడీలతో నినాదాలు చేస్తూ హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. రైతుల హక్కుల కోసం పోరాటం కొనసాగుతుందని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు.






