
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ నియోజకవర్గంలోని హుజురాబాద్, జమ్మికుంట పట్టణ, మండల, వీణవంక, ఇల్లందకుంట మండలాల పార్టీ అధ్యక్షుల నియామకం ఆదివారం రోజున జిల్లా అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ, వర్కింగ్ ప్రెసిడెంట్ పద్మాకర్ రెడ్డి, హుజురాబాద్ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు నూతనంగా నియమించబడ్డ అధ్యక్షులకు నియామక పత్రాలను అందజేశారు. హుజురాబాద్ పట్టణ అధ్యక్షుడిగా మేకల తిరుపతి, మండల అధ్యక్షుడిగా కొల్లూరి కిరణ్ కుమార్, జమ్మికుంట పట్టణ అధ్యక్షుడిగా సుంకరి రమేష్, మండల అధ్యక్షుడిగా వీరమనేని పర్శరామరావు, వీణవంక మండల అధ్యక్షుడిగా ఎక్కటి రఘుపాల్ రెడ్డి, ఇల్లందకుంట మండల అధ్యక్షుడిగా పెద్ది కుమార్ లు నియమితులైనారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీని నమ్ముకొని, పార్టీ కోసం కష్టపడి పని చేసిన ప్రతీ కార్యకర్తను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటామని, రాబోయే రోజుల్లో పార్టీ కోసం పనిచేసిన ప్రతీ ఒక్కరికీ తగిన గుర్తింపు ఇస్తామని, కార్యకర్తలను కపడుకుంటామని, ఎవరు అధైర్యపడొద్దని అందరికీ అవకాశాలు ఇస్తామని భరోసా ఇచ్చారు. గ్రామ స్థాయిలో పార్టీని బలపరచి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో హుజురాబాద్ నుండి మెజారిటీ స్థాయిలో సీట్లు పొంది ముందుండాలని కోరారు.ఈ కార్యక్రమంలో పీసీసీ మెంబర్ పత్తి కృష్ణారెడ్డి, హుజురాబాద్ వ్యవసాయ మార్కేట్ కమిటీ చైర్మన్ రాజేశ్వరి-స్వామిరెడ్డి, హనుమాన్ దేవాలయ చైర్మెన్ కొలిపాక శంకర్, జమ్మికుంట మున్సిపల్ కౌన్సిలర్ పొనగంటి మల్లయ్య, సాహెబ్ హుస్సేన్, సొల్లు బాబు తదితర నాయకులు పాల్గొన్నారు.

హుజురాబాద్ పట్టణ అధ్యక్షుడిగా మేకల తిరుపతి నియామక పత్రం అందుకుంటున్న దృశ్యం

కిరణ్ కుమార్ హుజురాబాద్ మండల అధ్యక్షుడిగా నియామక పత్రం అందుకుంటున్న దృశ్యం

ఇల్లందకుంట అధ్యక్షుడిగా పెద్ది కుమార్



జమ్మికుంట పట్టణ అధ్యక్షుడిగా నియామక పత్రాము అందుకుంటున్న రమేష్





