Oplus_131072
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్, జనవరి 5: హుజురాబాద్ పట్టణంలోని భవాని శంకర మహా దేవాలయ (శివాలయం) మినీ కళ్యాణ మండపానికి ఆదివారం భూమి పూజ, శంకుస్థాపన జరిగింది. దేవాలయానికి ఎదురుగా ఉన్న స్థలంలో భక్తులకు, దేవాలయానికి సంబంధించిన వివిధ కార్యక్రమాలకు, నవరాత్రి ఉత్సవాలకు ఉపయోగపడే విధంగా మినీ కల్యాణ మండపాన్ని నిర్మించనున్నారు. మినీ కళ్యాణ మండపం నిర్మాణం పట్ల భక్తులు హర్షం వ్యక్తం చేశారు. ఇది దేవాలయానికి, వివిధ కార్యక్రమాల నిర్వహణకు, భక్తులకు ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. ఈ శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మునిసిపల్ చైర్మన్ గందే రాధిక శ్రీనివాస్ తో పాటు దామెర హరికృష్ణ, దామెర రమేష్ బాబు (రాము), దామెర అనురాగ్ రోహిత్, కౌన్సిలర్లు అపరాజ ముత్యంరాజు, ప్రతాప తిరుమల్ రెడ్డి, ఎస్ పి ఆర్ రెసిడెన్షియల్ స్కూల్ కరస్పాండెంట్ గౌరిశెట్టి జగన్మోహన్, కోటేశ్వరరావు, గోలి కుమారస్వామి, గందే సాయి, భవాని శంకర మహాదేవాలయ అర్చకులు, వేద పండితులు కాట్రపల్లి విశ్వనాథశర్మ, గాయత్రి బ్రాహ్మణ సంఘ సభ్యులు, ప్రతినిధులు హాజరయ్యారు.







