Oplus_131072
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్,జనవరి 3:
నూతన సంవత్సరము సందర్భంగా పంచాయతీరాజ్ మినిస్ట్రియల్ ఉద్యోగులు రాజన్న సిరిసిల్ల జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి ఎస్ వినోద్ , ఉప ముఖ్య కార్య నిర్వహణాధికారి ఎం గీతలను శుక్రవారం మర్యాదపూర్వకంగా పంచాయతీరాజ్ మినిస్ట్రియల్ ఉద్యోగులు కలసి పూల భోకేను అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా సీఈవో తమ డిప్యూటీ సిఓ లు ఉద్యోగులతో మాట్లాడుతూ త్వరలో వివిధ ఎన్నికలు జరగనున్నాయని, వాటిని జిల్లాలో విజయవంతం చేయాలని ఉద్యోగులను కోరారు .ఈ కార్యక్రమంలో కరీంనగర్ ఉమ్మడి జిల్లా పంచాయతీ రాజ్ మినిస్ట్రీయల్ ఉద్యోగుల సంఘం బాధ్యులు వంగ సుధాకర్, మహమ్మద్ షఫీ యోద్దీన్, పాపారావు, రమేష్, వెంకటరమణ ,కుమార్, ఆకాష్, ఆయేషా, రామస్వామి, మధు, వెంకటేష్, శ్రీనివాస్, రఫీ, సద్దాం లతోపాటు ఉద్యోగులు పాల్గొన్నారు.







