
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజూరాబాద్, జనవరి 3: ఈనెల 2 నుంచి 7 వరకు మధ్యప్రదేశ్… భోపాల్లో జరుగుతున్న ఎస్టీఎఫ్ అండర్- 14 బాలుర హాకీ జట్టుకు హుజూరాబాద్ వాసులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మారుతీనగర్ కు చెందిన మోటపోతుల విక్రమ్ జట్టు మేనేజర్ గా, సాధుల శ్యామ్ సుందర్ కోచ్ గా, యేముల రవికుమార్ డిపార్ట్మెంట్ హెడ్ గా వ్యవహరిస్తున్నారు. కాగా వీరి ఎంపిక పట్ల హుజూరాబాద్ హాకీ క్లబ్ సభ్యులు, స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రం పేరు దేశంలో మారుమోగేలా కృషి చేయాలని హాకీ క్లబ్ సభ్యులు ఆకాంక్షించారు.

విక్రం..

శ్యామ్ సుందర్

రవికుమార్





