Oplus_131072
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్: రాష్ట్రంలో కాంగ్రెస్ గుండాగిరి మొదలుపెట్టిందని, బిజెపి స్టేట్ ఆఫీస్‌పై కాంగ్రెస్ గుండాలు దాడి చేయడాన్ని జిల్లా పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నామని జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలిపే హక్కును కాంగ్రెస్ విస్మరించిందని, కేవలం రౌడీయిజాన్ని నమ్ముకొని దాడులు చేస్తుందన్నారు. ఆ దిశలోనే బిజెపి రాష్ట్ర కార్యాలయంపై కాంగ్రెస్ గుండాలు రాళ్లు, కోడిగుడ్లతో దాడులు చేశారని, ప్రజాస్వామ్యంలో ఇది మంచి పద్ధతి కాదన్నారు. ప్రజాస్వామ్యవాదులు అందరూ ఇలాంటి దాడులను ఖండించాలన్నారు. దాడులు చేసిన కాంగ్రెస్ గుండాలను వెంటనే అరెస్టు చేయాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. అలాగే సీఎం రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ లు బిజెపి కార్యాలయంపై జరిగిన దాడికి సమాధానం చెప్పాలన్నారు.






