
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: 76వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం రోజున హుజురాబాద్ పట్టణంలోని గంగిశెట్టి మధురమ్మ మెమోరియల్ ట్రస్ట్ వారు తమ ట్రస్ట్ కార్యాలయంలో ట్రస్టు నిర్వాహకుడు గంగిశెట్టి జగదీశ్వర్ ఆధ్వర్యంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ముందుగా కార్యాలయ ట్రస్ట్ పైన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం అక్కడికి వచ్చిన చిన్నారులకు పెద్దలకు స్వీట్లు (మిఠాయిలు) పంపిణీ చేసి గణతంత్ర దినోత్సవ ప్రాముఖ్యను వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రైమరీ స్కూల్ తెనుగువాడ, ప్రైమరీ స్కూల్ ప్రతాప్ వాడకు సంబంధించిన విద్యార్థులు, ఉపాధ్యాయులు, వీధిలోని ప్రజలు పాల్గొన్నారు.







