
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ పురపాలక సంఘం ప్రత్యేక అధికారిగా జిల్లా అదనపు కలెక్టర్ ప్రపుల్ దేశాయ్ సోమవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర ప్రభుత్వం హుజురాబాద్ బల్దియా ప్రత్యేక అధికారిగా అదనపు బాధ్యతలు అప్పగించడంతో ఆయన చైర్మన్ కార్యాలయంలో ప్రత్యేక అధికారిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ ఎస్ సమ్మయ్య, మేనేజర్ భూపాల్ రెడ్డి, ఇతర ఉద్యోగులు ప్రత్యేక అధికారికి పుష్ప గుచ్చాలు ఇచ్చి స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు. త్వరలోనే అధికారులందరితో రివ్యూ మీటింగ్ నిర్వహించి ఏ ఏ అంశాలపై ఇలాంటి చర్యలు తీసుకోవాల్సి ఉంటుందో చర్చించి పట్టణ అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ప్రత్యేక అధికారి ప్రఫుల్ దేశాయ్ తెలిపారు.









