Oplus_131072
మండల యాదగిరి స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ఫిబ్రవరి 7న చలో హైదరాబాద్ షెడ్యూల్డ్ కులాలలో ఉన్న 59 ఉప కులాలకు అందరికీ రిజర్వేషన్ ఫలాలు దక్కాలనే డిమాండ్ తో గత 30 సంవత్సరాలుగా మంద కృష్ణమాదిగ అలుపెరగని పోరాటం చేసిన ఫలితంగా సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణను సమర్థిస్తూ అమలు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగించిందని కళామండలి హుజురాబాద్ మండల అధ్యక్షుడు
ఎర్ర శ్రీధర్ మాదిగ పేర్కొన్నారు. తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తామని ప్రకటించి ఏకసభ్య కమిషన్ ను నియమించారని, కమిషన్ రిపోర్ట్ ఆధారంగా ఎస్సీ వర్గీకరణను వెంటనే చేపట్టి మాదిగ మరియు ఉప కులాల విద్యార్దులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లక్ష డప్పులు, వేల గొంతుల హుజురాబాద్ మాదిగ కళామండలి నాయకులు సోమవారం హుజురాబాద్ లో ఎఫ్ సిఐ గోదాంలోని మాదిగ హమాలి సంఘ నాయకులను కలిసి ఫిబ్రవరి 7 న హైదరాబాదులో జరిగే లక్ష డప్పులు వేల గొంతుల మహా ప్రదర్శనకు ప్రతి ఒక్కరూ సంకన డప్పు వేసుకొని తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ఇంచార్జ్ తుంగ ఆంజనేయులు, కళామండలి హుజురాబాద్ మండల అధ్యక్షుడు
ఎర్ర శ్రీధర్ మాదిగ, నాయకులు బొడ్డు సంజీవ్ మాదిగ, ఎర్ర రాజకుమార్ మాదిగ, మొలుగు శ్రీనివాస్ మాదిగ, ఎర్ర నాగరాజు మాదిగ, అనిల్ మాదిగ మరియు హమాలీ సంఘ నాయకులు పాల్గొన్నారు.






