
Oplus_131072
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ఫిబ్రవరి 28న జాతీయ సైన్స్ దినోత్సవం పురస్కరించుకొని హుజురాబాద్ కు చెందిన గంగిశెట్టి మధురమ్మ మెమోరియల్ ట్రస్ట్ వారు కమలాపూర్ మండల కేంద్రంలోని కస్తూర్బా బాలికల విద్యాలయంలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులందరికీ సైన్స్ టాలెంట్ టెస్ట్ నిర్వహించారు. దీనిలో మంచి ప్రతిభ కనబరిచిన మొదటి ఐదు మంది విద్యార్థులకు బహుమతులను స్పెషల్ ఆఫీసర్ అర్చన చేతుల మీదుగా ట్రస్ట్ నిర్వాహకులు గంగిశెట్టి జగదీశ్వర్ (రిటైర్డ్ టీచర్) విద్యార్థులకు బహుమతులుగా డిక్షనరీలను, మెమొంటో లను అందజేశారు. ప్రథమ బహుమతిగా శ్రీజ, ద్వితీయ బహుమతిగా వర్షిత లకు శంకర్ నారాయణ డిక్షనరీలు మరియు మొమెంటులను మరో ముగ్గురు కన్సోలేషన్ ప్రైస్లుగా పూజ, అక్షయ వైశాలి లకు హ్యాండి డిక్షనరీ మెమొంటోళ్లు అందించారు. అనంతరము ఈరోజు వసంత పంచమి పురస్కరించుకుని కేజీబీ విద్యాలయంలోని 325 విద్యార్థులందరికీ ప్రతి విద్యార్థికి రెండు పెన్నుల చొప్పున అందజేశారు. ఈ కార్యక్రమంలో సాయిలత, మహేశ్వరి, భాగ్యలక్ష్మి, రజని, శ్రావణి, ధనలక్ష్మి మరియు విద్యాలయంలోని ఉపాధ్యాయునిలు అందరూ పాల్గొన్నారు.




