
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజూరాబాద్:
గ్లోబల్ శో టో కా న్ కరాటే డో ఇండియా కరీంనగర్ జిల్లా అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్కే జలీల్ ఆధ్వర్యంలో కరాటే శిక్షణ పొందుతూ అంతర్జాతీయ కరాటే పోటీలలో పథకాలు సాధించిన విద్యార్థులను మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ ఘనంగా సన్మానించారు.
ఇటీవల హైదరాబాద్ లోని ఎల్బీనగర్ పరిధిలో ఇండోర్ స్టేడియం లో జరిగిన మార్షల్ ఇంటర్నేషనల్ కరాటే చాంపియన్షిప్ కరాటే పోటీలలో జి ఎస్ కే డి ఐ. విద్యార్థుల ప్రతిభ ఎస్.కె షాదుల్లా బాబా 12 సంవత్సరాల బ్లాక్ బెల్ట్ కేటగిరిలో కటాస్ లో గోల్డ్ మెడల్, 15 సంవత్సరాల విద్యార్థినీల విభాగంలో ఆరెంజ్ బెల్ట్ కేటగిరి లో కటాస్ లో జమ్మికుంట మారుతి నగర్ కు చెందిన జున్ను కావ్య గోల్డ్ మెడల్, 14 సంవత్సరాల విభాగంలో కాచాపూర్ చెందిన ఓ.సన్నిహిత కటాస్ లో గోల్డ్ మెడల్, 8 సంవత్సరాల విభాగంలో కేటగిరి హుమేరా తస్లీమ్, కటాస్ లో గోల్డ్ మెడల్,
13 సంవత్సరాల విద్యార్థుల విభాగంలో వైట్ బెల్ట్ కేటగిరీ రంగాపూర్ గ్రామానికి సి హెచ్ ఆదిత్య వర్ధన్ గోల్డ్ మెడల్, 11 సంవత్సరాలు ఎల్లో బెల్ట్ కేటగిరీలో సిహెచ్ సాయి చరణ్ కటాస్ లో సిల్వర్ మెడల్ సాధించి ఈ ప్రాంతానికి ఆరు గోల్డ్ మెడల్స్ ఒకటి సిల్వర్ మెడల్ సాధించడం అభినందనీయమని అన్నారు.
అంతర్జాతీయ పోటీలలో పథకాలు సాధించిన విద్యార్థులకు తెలంగాణ రాష్ట్ర ఎస్సీ మాజీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజరై విద్యార్థినీ విద్యార్థులకు శుభాకాంక్షలు తెలుపుతూ అభినందించారు.
కరాటే నేర్చుకోవడం ద్వారా ఆత్మకైర్యంతో పాటు స్నేహభావాన్ని పెంపొందిస్తాదని అన్నారు. విద్యార్థిని విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ నేస్తున్నటువంటి ఎస్కే జలీల్ ప్రత్యేకంగా అభినందించారు.
విద్యార్థులు భవిష్యత్తులో ఇంటర్నేషనల్ కరాటే పోటీలలో గెలుపొందిన విద్యార్థులను ఒలంపిక్స్ లలో పథకాలు సాధించే దిశగా అడుగులు వేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో
తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ రాష్ట్ర అధ్యక్షులు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్,అంబేద్కర్ ఉత్సవ కమిటీ చైర్మన్ ఖాలిద్ హుస్సేన్, జ్యోతిరావు పూలే కమిటీ చైర్మన్ ఉప్పు శ్రీనివాస్, ప్రముఖ వ్యాపారవేత్త మొహమ్మద్ సలీం, కాంగ్రెస్ పార్టీ నాయకులు మేకల తిరుపతి, గోస్కుల మధు, న్యూ కాకతీయ స్కూల్ ప్రిన్సిపాల్ రాజ్ కుమార్, డైరెక్టర్ గోపాల్, డైరెక్టర్ వెంగళరావు, గ్లోబల్ షో టో ఖాన్ కరీంనగర్ జిల్లా అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు అంబాల ప్రభాకర్ తులసి లక్షణామూర్తి. తదితరులు అభినందించారు



ప్రతిభ కనబరిచిన విద్యార్థులను సత్కరిస్తున్న ముఖ్య అతిథులు.





