
Oplus_131072
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ పట్టణ లైసెన్సుడ్ ఇంజనీర్స్ అసోసియేషన్ అధ్యక్షులుగా హుజురాబాద్ పట్టణానికి చెందిన నలుబాల వేణుగోపాల్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గురువారం హుజూరాబాద్ పట్టణంలో లైసెన్సుడ్ ఇంజనీర్స్ అసోసియేషన్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షులుగా సబ్బని శ్రీనివాస్, ఉపాధ్యక్షుడిగా ఎండి గౌస్, కార్యదర్శిగా రామగిరి విక్రం, కోశాధికారిగా రావుల అరుణ్ కుమార్, ప్రోగ్రాం కన్వీనర్ గా గోపు నరేష్, కార్యవర్గ సభ్యులుగా వెంకటరమణ, నలుబాల సుమన్, కుమార్ లు ఎన్నికయ్యారు.
