
Oplus_131072
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: కరీంనగర్ నిజామాబాద్ అదిలాబాద్ మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న యాదగిరి శేఖర్ రావు కే తాము సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు హుజురాబాద్ మండల ట్రస్మా అధ్యక్షులు వకుళాభరణం వెంకటేశ్వర్లు తెలిపారు. గురువారం ఆయన హుజురాబాద్ లో విలేకరులతో మాట్లాడుతూ…బడ్జెట్ స్కూళ్ల ప్రయోజనం కోసం పోరాటం చేసే ట్రస్మా రాష్ట్ర మాజీ అధ్యక్షులు యాదగిరి శేఖర్ రావుకే తెలంగాణలోని అన్ని ప్రైవేటు పాఠశాలలు ఉద్యోగులు తమ మద్దతిస్తున్నట్లు తెలిపారు. తమ ప్రయోజనాల కోసం పాటుపడే వ్యక్తి యాదగిరి శేఖర్ రావు అని అన్నారు. రాబోయే కాలంలో ప్రైవేటు పాఠశాలల ప్రయోజనాల కోసం అందులో పని చేసే ఉపాధ్యాయుల హక్కుల కోసం పాటుపడే వ్యక్తి శేఖర్ రావు అని అన్నారు ప్రైవేటు విద్యాసంస్థల్లో పనిచేసే ఉపాధ్యాయులకు హెల్త్ కార్డు బీమా సౌకర్యం కల్పించే విషయంలో ప్రభుత్వంతో పోరాడి సాధించే శక్తి ఆయనకే ఉందని అన్నారు. కరోనా సమయంలో ఉపాధ్యాయులందరికీ 25 కిలోల బియ్యం రెండువేల రూపాయలు ప్రభుత్వ నుండి ఇప్పించిన ఘనత ఆయనదేనని అన్నారు. కార్పొరేట్ శక్తుల నుండి విద్యా వ్యవస్థను కాపాడడానికి యాదగిరి శేఖర్ రావు చేస్తున్న కృషికి రాష్ట్రంలో ఉన్న బడ్జెట్ స్కూలు అన్ని మద్దతు ఇస్తున్నాయని అన్నారు. బడ్జెట్ స్కూలు బతికితే అందులో పని చేసే ఎంతోమంది నిరుద్యోగ ఉపాధ్యాయులకు లాభం జరుగుతుందని పేద మధ్యతరగతి తల్లిదండ్రులకు సైతం తక్కువ ధరలో చదువులు లభిస్తాయని అన్నారు. అందుకే ట్రస్మా ఆధ్వర్యంలో ప్రైవేటు పాఠశాలల యజమానులు అన్ని పాఠశాలలను తిరిగి స్వచ్ఛందంగా యాదగిరి శేఖర్ రావు గెలుపు కోసం కృషి చేస్తామని అన్నారు. ఈ సమావేశంలో ట్రస్మా ప్రధాన కార్యదర్శి పారెడ్డి రవీందర్ రెడ్డి, నియోజకవర్గం అధ్యక్షులు బద్దుల రాజకుమార్, కోశాధికారి దాసరి కోటేశ్వర్, జిల్లా నాయకులు మాడిశెట్టి ప్రసాద్, విన్సెంట్ జార్జి, ఏనుగు మహిపాల్ రెడ్డి, టీ గోపాల్, వెంగళరావు, తిరుపతియాదవ్, విజయ్ పాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
