
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతీనిధి హుజురాబాద్, ఫిబ్రవరి 13 : తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ (ఐజేయు) 2025 డైరీ ని గురువారం స్థానిక పోలీస్ స్టేషన్ ఆవరణలో హుజురాబాద్ టౌన్ సిఐ గుర్రం తిరుమల్ గౌడ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా పాత్రికేయులు పనిచేస్తున్నారని ఆయన అన్నారు. ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న జర్నలిస్టుల పనితీరును ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో కన్వీనర్, కో- కన్వీనర్ గడ్డం ధర్మారెడ్డి, కాయిత రాములు, జర్నలిస్టులు కేసిరెడ్డి నరసింహారెడ్డి, నంబి భరణికుమార్, చిట్టంపల్లి సృజన్ తేజస్విరాజ్, చిలుకమరి సత్యరాజ్, పబ్బ తిరుపతి, కే శ్రీధర్, టేకుల సాగర్, కుడికాల సాయి, పోతురాజు సంపత్, చిర్ర సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.


