
–పట్టభద్రులకు ఉద్యోగులకు సేవ చేస్తా
అభ్యర్థుల పోటీ నామ మాత్రం
-విద్యా వ్యవస్థను గాడిలో పెడతా మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించండి
-ఎమ్మెల్సీ అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి
–నరేందర్ రెడ్డిని గెలిపించుకోవాల్సిన బాధ్యత స్వపక్షంతోపాటు విపక్షంపై కూడా ఉంది..
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్ ఒక్కసారి డిసైడ్ అయితే నా మాట నేనే వినను అనే మహేష్ బాబు సినిమా డైలాగుల ఉంది ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి పరిస్థితి. ఒక్కసారి డిసైడ్ అయ్యి రాజకీయాల్లోకి వచ్చాడు. ఇప్పుడు తనను గెలిపించాల్సిన బాధ్యత ప్రత్యర్థి పార్టీలతో పాటు సొంత పార్టీ నేతలపై కూడా పడింది ఎందుకంటే పొన్నం ప్రభాకర్‌కు ఒకవేళ డీలిమిటేషన్లో హుస్నాబాద్ గల్లంతయితే తిరిగి కరీంనగర్‌కు వచ్చి పోటీ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది అలాగే వెలిచాల రాజేందర్రావు భవిష్యత్తులో ఎంపీగా పోటీ చేయాలన్న పురుమళ్ళ శ్రీనివాస్ కరీంనగర్ రూరల్ ఎమ్మెల్యేగా పోటీ చేయాలన్న వీరందరూ ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డిని భారీ మెజారిటీతో ఎమ్మెల్సీగా గెలిపించి పంపించాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. భవిష్యత్తులో నరేందర్ రెడ్డి సహకారం తీసుకోవాల్సిన ఆవశ్యకత కూడా వారికి ఉంటుంది అలాగే గంగుల కమలాకర్ కు కరీంనగర్ కంచుకోటగా మారింది బండి సంజయ్ కు కరీంనగర్ ఎంపీ స్థానం కంచుకోటగా మారింది కరీంనగర్ రూరల్ ఎమ్మెల్యే స్థానాన్ని ఆశిస్తున్న సునీల్ రావు సైతం ఇప్పుడు ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డిని ఎమ్మెల్సీగా భారీ మెజార్టీతో గెలిపించి పంపించక ఇబ్బంది పెడితే భవిష్యత్తులో ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి బలమైన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి కరీంనగర్ ఎమ్మెల్యే స్థానాన్ని కరీంనగర్ ఎంపీ స్థానాన్ని కరీంనగర్ రూరల్ ఎమ్మెల్యే స్థానాల్లో ఏదైనా ఒకదాన్ని ఆశించే అవకాశం 100% ఉంటుంది కాబట్టి కాంగ్రెస్, బిఆర్ఎస్, బిజెపి నాయకులు వారి సీట్లను పదిలంగా ఉంచుకోవాలంటే ఎమ్మెల్సీగా ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గెలుపు విషయంలో చూసి చూడనట్లు వ్యవహరించాల్సిన పరిస్థితి ఉత్పన్నం అయ్యింది ఎందుకంటే ఆల్పోర్ట్స్ నరేందర్ రెడ్డికి సమీపంలో కూడా ఎవరు ప్రత్యర్థులు లేరు. కాబట్టి ఎమ్మెల్సీ నరేందర్ రెడ్డికి నిత్య పోరాటాలశీలి నిరంతర శ్రామికుడు అని పేరు ఉంది ఆయనను గెలిపించుకోవాల్సిన బాధ్యత పట్టబదులతో పాటు ఉద్యోగులపై ఉంది. అందుకే పార్టీలకతీతంగా ప్రతి ఒక్క పట్టబద్రుడు ఎమ్మెల్సీ నరేందర్ రెడ్డి కోసం కృషి చేస్తున్నట్లు స్వర్ణోదయం సర్వేలో బయటపడింది. ఇటీవల స్వర్ణోదయం రహస్య సర్వేలో పలు పార్టీల నాయకులను కార్యకర్తలను కలవగా వారు సైతం నరేందర్ రెడ్డి గెలుపు కోసం కృషి చేస్తున్నట్లు ప్రెస్ స్పష్టంగా తెలిసింది. అందుకే ఎమ్మెల్సీ గెలుపు నరేందర్ రెడ్డికి నల్లేరు మీద నడకే అన్నట్లుగా సాగుతుంది. ప్రత్యర్థులకు డిపాజిట్ కూడా రాదు అన్న చందంగా వీఎన్నార్ గెలుపు ఉంటుందని పార్టీలకతీతంగా కార్యకర్తలు నాయకులు చెబుతుండడం చెప్పుకోదగ్గ విషయం..


అన్ని పార్టీల మద్దతు కోరుతూ విఎన్ఆర్ చేస్తున్న ప్రచారం పలువురుని ఎంతగానో ఆకర్షిస్తుంది..


నామినేషన్ దాఖలు చేస్తున్న విఎన్ఆర్ (ఫైల్)





